నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూoడ్ల గ్రామంలో ఇటీవల దాదాపు 50 వృక్షాలకు గొడ్డలితో కాట్లు పెట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాజా మాజీ సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య దంపతులు పంచాయతీ, అటవీశాఖ, ఆర్అండ్ బి,రెవెన్యూ తదితర అధికారులకు విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు చిన్నతూoడ్ల గ్రామం అరేవాగు బ్రిడ్జి నుంచి పెద్దతూoడ్ల గ్రామపరిదిలోని సబ్ స్టేషన్ వరకు పంచాయితీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన తారు రోడ్డుకు ఇరువైపులా పదేళ్ల క్రితం లక్షలు వెచ్చించి అటవీశాఖ అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన వందలాది మొక్కలు పెరిగి నేడు వృక్షాలు అయ్యాయి.అయితే ఈ క్రమంలో ఇట్టి వృక్షాలను చంపడానికి చెట్ల చుట్టూ గొడ్డలితో మూరేడు కాట్లు పెట్టారని తెలిపారు. ఈ ఘటనపై ఇటీవల పలు పత్రికల్లో కథనాలు రావడంతో కాట్లు పెట్టిన చోట బురద రాసినట్లుగా పేర్కొన్నారు. చెట్లకు కాట్లు పెట్టిన విషయాన్ని పంచాయతీ, ఆర్అండ్ బి,అటవీశాఖ తదితర శాఖల అధికారుల దృష్టికి తీసుక వెళ్లిన పట్టించుకోలేదన్నారు.చెట్ల ప్రాణం అంటే అధికారులకు లెక్కలేదాని ప్రశ్నించారు ఇప్పటికైనా చెట్లను కాపాడాలని వేడుకొన్నారు.
పోలీస్ స్టేషన్లో పిర్యాదు…
చిన్నతూండ్ల గ్రామంలో ఇటీవల దాదాపు 50 వృక్షాలను చంపడానికి గొడ్డలితో కాట్లు పెట్టి,బయటకు పొక్కడంతో కాట్ల వద్ద బురద పూసిన ఆర్నెని అచ్యుత్ రావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తాజా మాజీ సర్పంచ్ పులిగంటి మమత నర్సయ్య,గడ్డం లక్ష్మయ్య,పులిగంటి రాములు తదితరులు కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.