– ప్రభుత్వ విప్ కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పై దురుసుగా ప్రవర్తించిన సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ పై చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసన్ కోరారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల పై మండలంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధు (చోటు) పై చర్యలు తీసుకోవాలని మండల పక్షాన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఏంది దర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ, సీనియర్ నాయకుడి పై చేయి చేసుకున్నాడని తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్న గడ్డం మధుపై చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాసన్ కోరినట్లు తెలిపారు. చోటును పిలిపించి మందలించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అతనిపై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుంటానని ఆది శ్రీనివాస్ నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.