అన్ని రకాల పోస్టుల భర్తీకి చర్యలు

అన్ని రకాల పోస్టుల భర్తీకి చర్యలు– టీపీహెచ్‌డీఏ వేడుకల్లో మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో అన్ని రకాల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీపీహెచ్‌డీఏ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రాథమిక కేంద్రాల నుంచి రిఫరల్‌ ఆస్పత్రుల వరకు అన్నింటిని అనుసంధానిస్తామని తెలిపారు.
అనంతరం టీపీడీహెచ్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కత్తి జనార్థన్‌ మాట్లాడుతూ 435 ప్రజారోగ్య వైద్యుల పోస్టులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నియామకాల్లో వయస్సుకు ప్రాధాన్యతనిస్తూ సీనియార్టీ పాయింట్లు కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మిగిలిన శాఖల్లో ఉన్న వైద్యుల పోస్టులను కలిపి పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ పూర్ణచందర్‌, డాక్టర్‌ రాంబాబు, డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ అభిరామ్‌, డాక్టర్‌ శశి కుమార్‌, డాక్టర్‌ నిఖిల్‌, డాక్టర్‌ వంశీ, డాక్టర్‌ భరత్‌, డాక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love