
మండల కేంద్రంలోని కస్తూరిబా మోడల్ హాస్టల్ లోని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ లోని హాస్టల్లో భోజనాన్ని పరిశీలించారు. కస్తూరిబా పాఠశాలలోని కూరగాయలను గుడ్లను పరిశీలించారు. తాగునీరుని కూడా పరిశీలించి ఇంతకు సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. హాస్టల్లో కిచెన్ను స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులకు పలు జాగ్రత్తలు పాటిస్తూ భోజనం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీ ఓ యూసుఫ్ ఖాన్ తదితరులు ఉన్నారు.