
భువనగిరి మండలంలోని అనాజిపురం, నందనం గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీఆర్ డీఓ సురేష్, భువనగిరి ఎంపీడీవో శ్రీనివాస తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఆయా గ్రామాలలో నర్సరీ పనులను పరిశీలించారు. వేసవికాలంలో మొక్కలకు నీరు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ వేసవికాలంలో ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న పనులు వారికి ఎంత కూలి వస్తుందని, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ బాలస్వామి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.