ఏసీబీకి చిక్కిన అడిషనల్‌ ఆర్‌ఐ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లాకు చెందిన అదనపు ఆర్‌ఐ ఎ. నరసింహ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవిగుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంకు చెందిన ఒక వ్యక్తి తన భూమికి సంబంధించిన మ్యుటేషన్‌ పనిని పూర్తి చేయాలని తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ పనిని పూర్తి చేయడానికి గాను రూ.5వేలను అదనపు ఆర్‌ఐ నరసింహ డిమాండ్‌ చేశారు. ఈ డబ్బులను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అడిషనల్‌ ఆర్‌ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనపర్చుకొని నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌ ఏసీబీ కేసుల ప్రత్యేకోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Spread the love