ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు

నవతెలంగాణ కమ్మర్ పల్లి: కేసీఆర్ గారి జనరంజక పాలన ,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గములో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం  కమ్మర్పల్లి  మండలం హాస కొత్తూర్ గ్రామానికి చెందిన రెడ్డి సంఘం యువకులు ,ఎస్.సి సంఘం మహిళలు, వేల్పూర్ మండలం లక్కోరా  గ్రామానికి చెందిన వింగ్స్ యూత్ యువజన సభ్యులు, నాగంపేట్ గ్రామానికి చెందిన మహిళలు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం రోజున ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం నుండి బీజేపీ సీనియర్ నాయకులు వేశాల సత్తయ్య, బీ.ఎస్.పి  మండల అధ్యక్షులు జంబుక రాజన్న,  సీనియర్ కార్యకర్ణి నాముడు రాజు, పీవైఎల్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి ఈర్గాల సృజన్, ఏర్గట్ల మండల పాస్టర్ల కార్య వర్గ సభ్యుడు జోసెఫ్ తొర్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఈర్గాల నర్సయ్య, కొలిపాక అశోక్, మోర్తాడ్ గంగాధర్, ఇతరులు  బొజ్జు వినోద్, బొజ్జ రవిదాస్ ,బొజ్జ భీమ సేనుడు, బెల్లారి రాజేశ్వర్, బండారి నవీన్, గురుల శంకర్, తదితరులు బిఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామం నుండి గొల్ల కుర్మా యువజన సంఘం సభ్యులు, వివేకానంద యూత్ సభ్యులు, ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామం నుండి  కంఠం విఘ్నేశ్వర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ లో చేరిన వారికి  కండువా కప్పి పార్టీలోకి మంత్రి ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
Spread the love