టిఫిన్ సెంటర్లో పూరీలు కాల్చిన వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ
ప్రజల దీవెన నాకే వేములవాడ హస్తం గెలుపు ఖాయం అంటూ ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్గొన్నారు . ఆదివారం వేములవాడ అర్బన్ మండలంలోని నంది విగ్రహం వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఓ హోటల్లో పూరీలు, దోశలు, బజ్జీలు వేసి కస్టమర్లను, నిర్వాహకులను ఓటు అభ్యర్థించారు. అనంతరం మారుపాక గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఒక అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని ఆది శ్రీనివాస్ ప్రజలను ఓటు అభ్యర్థించారు. బీసీ బిడ్డగా 30ఏళ్లగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖంలో పాల్గొన్న వ్యక్తిగా మరోసారి మీ ముందుకు వస్తున్నాను ఈసారి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ధన బలం, మద్యం లోబర్చుకునే, పలుకుబడి ఉన్న వ్యక్తులతో ఓ సాధారణ మధ్యతరగతి బిడ్డగా ఈ ఎన్నికల పోటీలో ఉన్నానని అన్నారు. ఏకగ్రీవ తీర్మానం చేసిన వేములవాడ విలీన గ్రామమైన శాత్రాజుపల్లి మాల సంఘం. మాల సంక్షేమ సంఘం వేములవాడ 2వ వార్డ్ (శాత్రాజుపల్లి) మూలే మునేందర్ అధ్యక్షతన సమావేశమై సంఘ సభ్యులందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ చేతు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించుకొనుటకు ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. .ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య ,ఓబిసి మాజీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, మూలే మునేందర్, చెర్ల రమేష్, పాశం రాజరత్నం, పాశం కిషన్, తంపుల దేవేందర్, తంపుల అంజయ్య, కిషోర్ మూలే,రాగుల రమేష్, దేవ మల్లేశం,చేర్ల సుధీర్ ,చెర్ల బాలచందర్, రాగుల చంద్రశేఖర్, తంపుల శంకరయ్య ,మూలే పెద్ద దేవయ్య, తంపుల పుల్లయ్య, దేవ స్వామి, పాశం విట్టల్ , ఎడ్ల రాజేశం ఎడ్ల చంద్రయ్య,తంపుల సాయి, పాశం ప్రదీప్, పాశం ప్రణయ్, పాశం ప్రశాంత్, చేర్ల వినీత్ , మూలే అజయ్, పాశం ప్రవీణ్, పాశం బన్నీ (ప్రవీణ్) తదితరులు పాల్గొన్నారు.