రూ.636 లక్షల అభివృద్ధి పనులకు ఆదిభట్ల కౌన్సిల్‌ ఆమోదం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పెండింగ్‌లోఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేం దుకు రూ.636 లక్షలకు ఆదిభట్ల మున్సిపల్‌ సర్వసభ్య స మావేశం ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొత్త ఆర్ధిక అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం బుధవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌, పరిపాలన విభా గాలు, పారిశుధ్య విభాగాలకు సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించారు. వివిధ వార్డుల్లో ఇంజనీరింగ్‌ విభా గానికి సంబంధించిన అభివృద్ధి, నిర్వహణ పనులకు, మె యింటెనెన్స్‌ పనులకు సంబంధించి రూ. 636 లక్షలకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో వైస్‌ చైర్‌ పర్స న్‌ కోరె కళమ్మ, కౌన్సిల్‌ సభ్యులు లావణ్య, మౌనిక, మం హేందర్‌, నిరంజన్‌ రెడ్డి, అర్చన, మున్సిపల్‌ కమిషనర్‌ కె. అమరెందర్‌ రెడ్డి, ఏఈ వీరాంజనేయులు, మేనేజ్‌ శ్రీనివా సులు, టీపీఓ హబీబ్‌ ఉన్నిసా బేగం, శానిటేశన్‌ ఇన్స్‌పెక్టర్‌ టి.అశోక్‌ పాల్గొన్నారు.

Spread the love