సమస్యల పరిష్కారానికే ‘శుభోదయం’

– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
నియోజకవర్గంలోని గ్రామాల్లోని సమస్యలు తెలుసుకోవడానికి శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నాడు మండలములోని మాసాని గూడ, కచ్చిరెడ్డిగూడ, లచ్చిరెడ్డి గూడ మంచర్ల గూడా గ్రామంలో శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోని వార్డ్‌ వార్డు తిరిగి ప్రజల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి సీఎం కేసీఆర్‌ తోనే సాధ్యమ వుతోందన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో గ్రామ పంచా యతీలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. నేడు గ్రామాల్లో 24 గంటల కరెంటు నిరంతరాయంగా తెలం గాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామాల్లో ఏమైన చిన్న చిన్న సమస్యలు ఉంటే అధికారులు వెంటనే పరిష్క రించాలని ఆదేశించారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రతి గ్రామ ప్రంచాయతీకి ట్రాక్టర్‌ , శ్శశాన వాటిక, పల్లె ప్రకృతి వనం నిర్మించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధుల ద్వారా సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేయాలని సర్పం చులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన రడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాపారావు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు కావలి గోపాల్‌, మాసానిగూడ సర్పంచ్‌ కొత్తపల్లి రాములు, మాజీ సర్పంచ్‌ సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్‌ ప్రభుగౌడ్‌, ఎంపీటీసీ వెంకటరెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love