ఆప్కో రాష్ట్ర డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ..

నవతెలంగాణ-వీణవంక
చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆప్కో రాష్ట్ర డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ అన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా  డీసీసీ బ్యాంకు ద్వారా చేనేత కార్మికులు తీసుకున్న రుణాలకు పావులా వడ్డీ రుణాలకు సంబంధించి రూ.2కోట్ల 98లక్షల 24వేల311ల చెక్కును చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్ లో అందజేశారు. అలాగే చేనేత కార్మికుల కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. కార్మికుల కోసం ప్రత్యేక బీమా, పింఛన్, రాయితీ రుణాలు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఉపేందర్, ఊటూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాంచంద్రం, కోర్కల్, వీణవంక చేనేత కార్మికులు అడిగొప్పుల రాణి,  రాధ తదితరులు పాల్గొన్నారు.

Spread the love