హనుమాన్ దేవస్థానం భూముల కౌలు వేలంపాట వాయిదా..

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలోని హనుమాన్ దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల కౌలు వేలంపాట శుక్రవారం నాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నిర్వహించాలని, మేనూరు గ్రామపంచాయతీ ఆవరణంలో అన్ని రకాలుగా సిద్ధం చేసినప్పటికీ, కౌలు వేలంపాటలో పాల్గొనేందుకు ఇద్దరు వ్యక్తులు డిపాజిట్ చేసినప్పటికీ, అనివార్య కారణాలవల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమాన్ దేవస్థానం భూముల కౌలు వేలం వాయిదా వేయవలసి వచ్చిందని, వేలంపాటకు హాజరైన అధికారులు తెలిపారు. మేనూర్ శివారు ప్రాంతంలో హనుమాన్ దేవస్థానానికి 148 /1 లో7,08 ఎకరాలు అదేవిధంగా148/2 లో7,08 ఎకరాల భూమి ఉంది. మొత్తం 14 ఎకరాల 16 గుంటల భూమి కోసం వేలంపాట నిర్వహించేందుకు అధికారులు పాల్గొన్నప్పటికీ అనివార్య కారణాలవల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌలు వేలంపాట వాయిదా వేయవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారిని కమలాబాయి ఇతర అధికారులు పాల్గొనగా, మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ గుమస్తా వేణు తో, పాటు ఆలయ సిబ్బంది, అదే విధంగా మద్నూర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ శంకర్, మేనూర్ గ్రామ కార్యదర్శి సురేష్, తాజా మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ, ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love