బార్ లైబ్రరీ కి న్యాయవాది బూరివిరాళం..

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాది గోపాల్ రెడ్డి బార్ లైబ్రరీకి ఐదు టేబుళ్లను విరాళంగా అందజేశారు. బార్ అధ్యక్షుడు దేవదాస్, ప్రధాన కార్యదర్శి భాగి చరణ్, లైబ్రరీ కార్యదర్శి బాలరాజు నాయక్ వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులు ఇతోధికంగా విరాళాలు అందజేస్తే మరిన్ని మౌళిక వసతులు లైబ్రరీలో ఏర్పాటుకు వీలు అవుతుందని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు జె.వెంకటేశ్వర్, అరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love