ఉద్యోగ విరమణ తర్వాత…

పెన్షనర్స్‌కి ఎటువంటి సౌకర్యాలు లేవు

నేను మిధాని కంపెనీ లో 3ం సంవత్సరాలు పనిచేశాను. ుచీుఖజ అనుబంధంగా ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి కార్మిక సమస్యలపై పోరాడుతున్నాను. రిటైర్మెంట్‌ తరువాత ణA, ూ=జ, ×= వంటి కనీస సౌకర్యాలు కూడా సమయానికి అందడం లేదు. పెన్షన్లు కూడా ఆలస్యంగా వస్తాయి. బాలాపూర్‌ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. గత ప్రభుత్వాలు పెన్షనర్స్‌కి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఇ.పి. ఆసరా పెన్షన్‌ సౌకర్యం కావాలి. ఆర్‌.టి.సి బసుల్లో సీనియర్‌ సిటిజన్స్‌ కు ఇచ్చే రాయితీ వంటి సమస్యలపై కొత్త ప్రభుత్వం అయినా దష్టి సారించాలని కోరుతున్నాము... - కె.రాధాకృష్ణ
పెన్షన్‌ సౌకర్యం వర్తింప చేయాలి

నేను మిధాని కంపెనీలో 32 సంవత్సరాల పాటు పనిచేసాను. రిటైర్మెంట్‌ తరువాత 2 సంవత్సరాల నుండి ుAూ=ూA (సిఐటియు) బాలాపూర్‌ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. గత ప్రభుత్వాలు పెన్షనర్స్‌ కి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఇ.పి.ఎస్‌ -95 పెన్షనర్లకు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పెన్షన్‌ సౌకర్యం వర్తింప చేయాలని కోరుతున్నాం. ఆర్‌.టి.సి బసుల్లో సీనియర్‌ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీ, ఆరోగ్యశ్రీ కార్డులను వర్తింపచేయాలని కోరుతున్నాం. - కె.నర్సప్ప
ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

నేను ఎల్‌ఐసీలో ఉద్యోగం చేశాను. రిటైర్‌ అయ్యి ఏడాది దాటింది. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం కాస్త బోర్‌గానే అనిపిస్తుంది. సుమారు 30, 40 ఏండ్లు ఉద్యోగం చేసి రోజూ ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళడం, పనిలో బిజీగా ఉండడం, ఎప్పుడో రాత్రికి ఇంటికి రావడం సమయం తెలియసేది కాదు. కానీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం అయితే బోర్‌గానే ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా స్నేహితులు, బంధువుల ఇండ్లకు వెళ్ళడం చేస్తుంటాను. అలాగే అరవై ఏండ్లు దాటతాయి కాబట్టి ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలి. అప్పటి వరకు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో మన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. కాబట్టి వయసు రీత్యా జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. అందుకే మంచి ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు సామాజిక కార్యక్రమాల్లో భాగం కావడం, రోజూ వాకింగ్‌, వ్యాయమం చేస్తుంటే మనసూ, శరీరం రెండూ ఉత్సాహంగా ఉంటాయి. అలాగే మాకు ఒక సమస్య కూడా ఉంది. ఉద్యోగస్తులందరికీ ప్రతి నెలా ఆఖరులో వేతనం వేస్తారు. పెన్షనర్స్‌కు మాత్రం ఒకటో తేదీ వేస్తారు. మాకు కూడా ఉద్యోగస్తులతో పాటు వేస్తే బాగుంటుంది.
- ఎస్‌.నాగేశ్వరావు, రిటైర్‌ సీఆర్‌ఎం మేనేజర్‌, ఎల్‌.ఐ.సి
పాత పెన్షన్‌ పునరుద్ధరణ జరగాల్సిందే
ఉద్యోగం విరమణ అనంతర జీవితం కష్టంగా ఉందా? సుఖంగా ఉందా? అంటే ఉద్యోగం చేస్తున్న కాలంలో ఆ పెన్షనర్‌ జీవనవిధానాన్ని బట్టి అంచనా వేయవలసి వస్తుంది. ఇది వ్యక్తిగత, వత్తి గత, కుటుంబ జీవితానికి అన్నింటికి సంబంధించి అనుభవాలతో అరవై ఏళ్ల తరువాతి జీవితాన్ని అంచనా వేయాలి.... మామూలుగా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించి ఆచరించిన టైర్లు తమ భవిష్యత్‌ గురించి ఆలోచించరు. పిల్లలను ప్రేమతో, బాధ్యతతో వారి బంగారు భవిష్యత్తు గురించి తమ సర్వస్వం ధారపోసి పెంచుతున్నాం కాబట్టి తమ వయసు ఉడికిన నాడు పిల్లలు చూసుకుంటారని ధీమాతో ఉంటారు... అయితే ఆ భావన నాలుగు, ఐదు శాతానికి మించి ఆచరణలోకి రావడం లేదనేది వాస్తవం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లక్షణాలను ఈ ఆధునిక కాలంలోనూ అమలు అవుతాయన్న భ్రమలను వదిలించుకొని తమ పిల్లలకు, తమ తల్లిదండ్రులకు బాధ్యతగా చేయవలసింది చేస్తూనే భార్యాభర్తలు తమ ఉద్యోగానంతర జీవితానికి భధ్రమైన ఏర్పాటు (ఆర్థిక, శారీరక, మానసిక దఢత్వం సమకూర్చుకోవడం) చేసుకోవడం అత్యవసరం. అది లేని నాడు పెన్షన్‌ పొందుతున్నా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వచ్చినా ఫలితం లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపు నిండా తిండి, బట్ట, అనారోగ్యాలకు చికిత్స కరువై అల్లాడుతున్నారు. మనవలు, మనవరాళ్ళతో మిగిలిన జీవితం కాలక్షేపం చేద్దామనుకుంటే ఆ ఆశా లేక బలవంతంగా పేగు బంధాన్ని తెంచుకుని వద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. భారతదేశంలో ప్రపంచీకరణతో వచ్చిన ప్రమాదాల్లో హక్కులు తప్ప బాధ్యత లేని కారణంగా కుటుంబ వ్యవస్థ కూడా కుప్ప కూలుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు పొంది భరోసాతో జీవితం గడిపిన తరాలు వద్ధాప్య దశకు చేరితే వారి పిల్లలు భరోసా, భద్రత లేని అరకొర వేతనాలతో (నిరుద్యోగ భారతం నానాటికీ పెరుగుతున్నది చూస్తున్నాం కదా). తాము కన్నవాళ్ళకే సరైన పోషణ ఇవ్వలేని స్థితిలో తమను కన్నవారిని చూడలేకపోవడమే కాకుండా వాళ్ళకు వచ్చే పింఛన్లు కూడా వాడుకునే స్థితిలో నేటి తరం ఉన్నారు. నేడు ఇదొక విషాద వాస్తవం.
కేంద్ర పాలకులైన కాంగ్రెస్‌, బీజేపీలు పెన్షన్‌ ఉద్యోగుల హక్కు భిక్ష కాదు అన్న వాస్తవాన్ని పక్కకు పెట్టి మందబలంతో అశాస్త్రీయ విధానాలతో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ఈ దేశంలోని కోట్లాది ఉద్యోగులపైన బలవంతంగా రుద్ది, వారి కుటుంబాలను ఆగం చేశారు. దేశాభివద్ధికి చోదక శక్తులుగా, సైనికులుగా, సేవకులుగా నాలుగైదు దశాబ్దాల పాటు తమ సర్వ శక్తి సామర్థ్యాలను అర్పించిన వారికి కొత్త పెన్షన్‌ విధానంతో బతికుండగానే పాడె గట్టిన స్థితిని కల్పించారు. 2003 నుంచి 2013 వరకూ పీ.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ. బిల్లు చట్టం కాకుండా ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మికుల పక్షాన పార్లమెంటులో నిర్విరామ కషి చేసింది వామపక్ష సభ్యులు. వారు బలహీన పడగానే గోతికాడ నక్కలా కాచుక్కూర్చుని పెన్షన్‌ ఫండ్‌ తో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్న అస్మదీయులకు మేలు చేసేందుకు సిద్ధమని బీజేపీ, సహకరించిన కాంగ్రెస్‌ కారణంగా న్యూ పెన్షన్‌ అంటే నో పెన్షన్‌ తీసుకొచ్చారు. చట్ట రూపం దాల్చిన 2013 నుంచి కాకుండా 2004 జనవరి ఒకటి నుంచే అమలుకు పూనుకోవడం మరొక దుర్మార్గం. కొత్త పెన్షన్‌ అమలు కారణంగా ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబ పెన్షన్‌ వెయ్యి, పదిహేను వందలు మాత్రమే అందుకుంటున్నారు అంటే ఎంతో దుర్మార్గమైన విధానం ఇది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగం తప్ప ఉద్యోగాల ఊసే లేదు కాబట్టి కనీసం అంతకు ముందు పదేళల్లో ఉద్యోగంలో చేరిన వారికైనా పాత పెన్షన్‌ సౌకర్యం ఉండేది. ఇదీ దేశభక్త బీజేపీ నిర్వాకం.
దేశంలో అత్యుత్సాహంతో కొత్త పెన్షన్‌ విధానాన్ని ఆమోదించింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం. పాత పెన్షన్‌ ను పునరుద్ధరించాలని దశాబ్దకాలంగా జరుగుతున్న పెన్షనర్ల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాల ఒత్తిడికి అనివార్యంగా తొలొగ్గిన హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ గడ్‌, పంజాబ్‌ మొదలైన రాష్ట్రాలు తమ శాసన సభల ఆమోదంతో కొత్త పెన్షన్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి లేఖలు పంపితే పీ.ఎఫ్‌.ఆర్‌.డీ.ఏ చట్టంలో వెనక్కి వచ్చే అవకాశం లేదనీ, కాంట్రీబ్యూటరీ పెన్షన్‌లో రాష్ట్రాలు జమచేసిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేమనీ కేంద్రం చెప్తున్నది. ఎంత వంచన... దేశ సంపదను అప్పులు రూపేణా తీసుకున్న కార్పొరేట్లకు కోట్లాదిగా మాఫీ చేయగలిగిన పాలకులు, ఉద్యోగుల సొమ్ముతో వ్యాపారం చేస్తూ కొత్త పెన్షన్‌ పథకం నుంచి విరమించుకునే అవకాశం లేదని చెప్పడం అంటే... ఇంత కన్నా మోసం, దగా ఇంకొక ఉంటుందా!
ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మానిఫెస్టోలో చెప్పినట్లు పాక్‌ పెన్షన్‌ పునరుద్ధరణపై మాట నిలబెట్టుకోవలసి ఉంది. రేపటి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు కానీ. 24ల జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు కానీ, అతి ముఖ్యమైన సమస్యలతో పాటు పాత పెన్షన్‌ పునరుద్ధరణ అన్ని పార్టీలు మానిఫెస్టోల్లో ఒక ప్రధాన అంశంగా ఉండాలని, లేనట్లయితే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని దేశ వ్యాప్త పెన్షనర్‌ సంఘాలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. గత నెల నవంబర్‌ 4 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ, రామ్‌ లీలా మైదానంలో లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మిక,పెన్షనర్ల మహాధర్నా తమ ఉద్యమపోరును ఉధతం చేస్తామని ప్రకటించింది. కొత్త పెన్షన్‌ రద్దు - పాత పెన్షన్‌ పునరుద్ధరణ జరగాల్సిందే.
- మోతుకూరి సంయుక్త ”బాగున్నారా? ఆరోగ్యమెట్లా వుంది? ఏం చేస్తున్నారు?” అని ఒక పెన్షనర్‌ను అడిగితే… ”బాగానే వున్నానండీ! కొద్దిగా షుగర్‌, బి.పి తప్ప ఆరోగ్యానికి ఢోకా లేదు. బాగనే తింటున్నా, తిరుగుతున్నా. ఇక ఏం చేస్తున్నానంటారా, విశ్రాంత ఉద్యోగికి చేసేదేముంటుంది చెప్పండి. విశ్రాంతి తీసుకోవడమే (ఇదో పనికిమాలిన లాజిక్‌). పేపర్‌ చదువుతా, టీవీ చూస్తుంటా, బంధుమిత్రులతో ఫోన్లో మాట్లాడుతుంటా, ఉదయం కొద్దిసేపు వాకింగ్‌కి వెళ్లస్తా” ఇదీ సాధారణంగా వచ్చే జవాబు. ఒక్క వాకింగ్‌ను మినహాయిస్తే మిగిలిన పనులకేమీ నిబద్ధత లేదు. ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చినట్టు చేసే పనులకు ఒక లక్ష్యంగాని, ప్రయోజనం కాని వుండవు. అసలా ‘విశ్రాంతి’ అనే మాటే అంత తగినది కాదనిపిస్తుంది. కొన్ని గంటలపాటు ఒక పనిని ఏకదీక్షగా చేసి, శారరకంగా, మనసికంగా అలసిపోయినప్పుడు కొద్దిసేపు అంటే గంటో, అరగంటో పనికి విరామాన్నియ్యటాన్ని విశ్రాంతి అంటారు. అది అవసరమే. అంతేగాని ‘విశ్రాంత జీవనం’ వాంఛనీయం కాదు. ఈ రోజు ‘పెన్షనర్స్‌ డే’ సందర్భంగా ఉద్యోగ విరణమణ తర్వాత వారి జీవన విధానం, మానసిక సంఘర్షణ ఏవిధంగా ఉంటుదో, ఓ పెన్షనర్‌గా వారు అనుభవిస్తున్న జీవితం ఎలాంటిదో ఈ వారం కవర్‌ స్టోరీ…అరవయ్యేళ్ల వయసొచ్చేదాక (సుమారు) కొన్ని కఠినమైన నిబంధనలకు లోబడి వేతనం తీసుకుంటూ ఉద్యోగం చేస్తాం. అలా కొన్నేండ్ల పాటు పని చేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మిగిలిన జీవితాన్ని ఏ పనీ చెయ్యకుండా విశ్రాంతిగా గడపడం శ్రేయస్కరం కాదు. మితిమీరిన విశ్రాంతి బద్ధకమనే కొత్త జబ్బుకు దారితీస్తుంది. విశ్రాంతి అంటే కార్యభారాన్ని దించేసుకుని మిన్నకుండడం కాదు. పనిమార్పు.. భుజం మార్చుకోవడం. అప్పటిదాకా చేసిన పని కాక సమాజానికి ఉపయోగపడే వేరొక పనిని, ఇష్టమైన రంగంలో ఎన్నుకొని చెయ్యడం. అంతే గాని ఖాళీగా కూర్చునే హక్కు తీవ్ర వ్యాధిగ్రస్తులకు తప్ప ఎవరికీ లేదు.
తిని కూర్చునే హక్కు లేదు
అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఒక నిర్ధిష్టమైన వయసులో రిటైరయి విశ్రాంతి జీవనం గడుపుతున్నారా? మంచానపడేంతవరకు, చనిపోయేంతవరకు దేశ సంపదను ఉత్పత్తి చేసే మహత్కార్యంలో భాగస్వాములు కావడం లేదా? మరివారికి లేని హక్కు అంటే తిని కూర్చునే హక్కు మనకెక్కడిది? మహిళా పెన్షనర్ల విషయంలో మహిళా సంఘాలున్నాయి. వాస్తవంగా మహిళల సమస్యలు కూడా నాగరికతతో పాటు బహు విధాలుగా పెరుగుతున్నాయి. వాటి పరిష్కారాల దిశలో మమేకమై స్వచ్ఛందంగా పనిచెయ్యొచ్చు. ఇంతకుముందు ప్రస్తావించినట్టు మహిళలకు, పురుషులకు పనికొచ్చే విధంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు వున్నాయి. ఇవికాకపోయినా మీరు నివసించే వార్డులో కొన్ని ప్రత్యేక సమస్యలు తప్పనిసరిగా వుంటాయి. వాటి పరిష్కారాల్లో తగిన భాగస్వామ్యం తీసుకోవచ్చు.
అతి జోక్యం వద్దు
పెన్షనర్ల కుటుంబాలన్నీ సమస్యలన్నింటినీ అధిగమించాయని కూడా చెప్పలేం కదా! మీరు సర్వీసంతా కుటుంబం కోసం శ్రమించినా, రిటైరయిన తర్వాత కూడా చెయ్యాల్సిన పనులున్నాయనుకోండి, సమాజ సేవకు వెళ్లేముందు కుటుంబంలో ఆ మిగిలిపోయిన పనులను, అవి మీరే చెయ్యాల్సినవైతే ముందు వాటిని చక్కదిద్దే బాధ్యత తీసుకోండి. ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో అతి జోక్యం చేసుకోకండి. అవసరమనుకుంటేనే సలహాలివ్వండి. ఆజ్ఞాపించకండి. మీ సలహా పాటించాలని పట్టుపట్టకపోవటమే కాదు, అలా ఆశించవద్దు కూడా. మీ సంతానమే కాదు, మీ మనవళ్లు, మనవరాళ్లు కూడా మీ మాటలు పట్టించుకోకపోవచ్చు. అట్లాంటప్పుడు వారిని మందలించడం, దండించడం లాంటి పనులు అస్సలు చేయకండి. ఆ పని చేసే బాధ్యత, హక్కు తల్లిదండ్రులకే వుంటుంది. తరాల అంతరాలను గమనించి మసలుకోండి. గౌరవాన్ని దక్కించుకోండి. మీరు మీ సంతానం విషయంలో చూపించిన ప్రేమ, మీ పిల్లలు పెద్దవాళ్లయి, వాళ్లకూ పిల్లలు కలిగిన తర్వాత కూడా మీ విషయంలో తిరిగి అంతే మోతాదులో ప్రేమను కురిపించాలంటే కుదరదు. వాళ్లు కూడా మీ మార్గాన్నే అనుసరించి వాళ్ల పిల్లలపై అధిక ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమే కాస్తో కూస్తో మీ వైపు ప్రసరించవచ్చు. అంతటితోనే సంతృప్తి చెందాలి.
ఒక ముఖ్యమైన విషయం. ఈ ప్రేమాభిమానాలు పంచుకునే విషయంలో మీ జీవిత భాగస్వామిని మాత్రం మీరు దూరం చేసుకోవద్దు. ఎంతటి వార్ధక్యంలోనైనా ఇద్దరి మధ్య అనురాగబంధం బలపడుతూనే వుండాలి. అది జరిగితే మీరు విజయం సాధించినట్లే.
కొసమెరుపు: ఎప్పటిలాగే ఈ వ్యాసకర్త తన భార్యను తోడుగా తీసుకుని హైదరాబాద్‌ కేర్‌ హాస్పిటల్‌కు వెళ్లి సీనియర్‌ షుగర్‌ స్పెషలిస్టు డా||బిపిన్‌కుమార్‌ సేధీ దగ్గరకు వెళ్లాడు. ఆయన మందులు రాసిచ్చి, వ్యాసకర్త భార్యతో ”చూడండమ్మా! మీ ఇంట్లో పనిమనిషిని మాన్పించి, మీ వారిచేత అంట్లగిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం చేయించండి. 78 ఏళ్ల వయసొచ్చినా, చేతనైన పని చేస్తూ వుంటేనే శారీరక, మానసిక ఆరోత్యం బాగుంటుంది” అన్నారు.
‘డాక్టర్‌ అంటే మందులిచ్చేవాడే కాదు, మందలించేవాడు కూడా’.
(డిసెంబర్‌ 17న జాతీయ పెన్షనర్స్‌ డే)
– కందాడై శ్రీనివాసులు, 9246901149
పెన్షనర్స్‌కి ఎటువంటి సౌకర్యాలు లేవు
నేను మిధాని కంపెనీ లో 3ం సంవత్సరాలు పనిచేశాను. ుచీుఖజ అనుబంధంగా ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి కార్మిక సమస్యలపై పోరాడుతున్నాను. రిటైర్మెంట్‌ తరువాత వంటి కనీస సౌకర్యాలు కూడా సమయానికి అందడం లేదు. పెన్షన్లు కూడా ఆలస్యంగా వస్తాయి. బాలాపూర్‌ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. గత ప్రభుత్వాలు పెన్షనర్స్‌కి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఇ.పి. ఆసరా పెన్షన్‌ సౌకర్యం కావాలి. ఆర్‌.టి.సి బసుల్లో సీనియర్‌ సిటిజన్స్‌ కు ఇచ్చే రాయితీ వంటి సమస్యలపై కొత్త ప్రభుత్వం అయినా దష్టి సారించాలని కోరుతున్నాము… – కె.రాధాకృష్ణ
పెన్షన్‌ సౌకర్యం వర్తింప చేయాలి
నేను మిధాని కంపెనీలో 32 సంవత్సరాల పాటు పనిచేసాను. రిటైర్మెంట్‌ తరువాత 2 సంవత్సరాల నుండి ుAూ=ూA (సిఐటియు) బాలాపూర్‌ శాఖకు ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాను. గత ప్రభుత్వాలు పెన్షనర్స్‌ కి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా ఇ.పి.ఎస్‌ -95 పెన్షనర్లకు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పెన్షన్‌ సౌకర్యం వర్తింప చేయాలని కోరుతున్నాం. ఆర్‌.టి.సి బసుల్లో సీనియర్‌ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీ, ఆరోగ్యశ్రీ కార్డులను వర్తింపచేయాలని కోరుతున్నాం. – కె.నర్సప్ప
ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
నేను ఎల్‌ఐసీలో ఉద్యోగం చేశాను. రిటైర్‌ అయ్యి ఏడాది దాటింది. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం కాస్త బోర్‌గానే అనిపిస్తుంది. సుమారు 30, 40 ఏండ్లు ఉద్యోగం చేసి రోజూ ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళడం, పనిలో బిజీగా ఉండడం, ఎప్పుడో రాత్రికి ఇంటికి రావడం సమయం తెలియసేది కాదు. కానీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం అయితే బోర్‌గానే ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా స్నేహితులు, బంధువుల ఇండ్లకు వెళ్ళడం చేస్తుంటాను. అలాగే అరవై ఏండ్లు దాటతాయి కాబట్టి ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలి. అప్పటి వరకు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో మన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. కాబట్టి వయసు రీత్యా జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. అందుకే మంచి ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు సామాజిక కార్యక్రమాల్లో భాగం కావడం, రోజూ వాకింగ్‌, వ్యాయమం చేస్తుంటే మనసూ, శరీరం రెండూ ఉత్సాహంగా ఉంటాయి. అలాగే మాకు ఒక సమస్య కూడా ఉంది. ఉద్యోగస్తులందరికీ ప్రతి నెలా ఆఖరులో వేతనం వేస్తారు. పెన్షనర్స్‌కు మాత్రం ఒకటో తేదీ వేస్తారు. మాకు కూడా ఉద్యోగస్తులతో పాటు వేస్తే బాగుంటుంది.
– ఎస్‌.నాగేశ్వరావు, రిటైర్‌ సీఆర్‌ఎం మేనేజర్‌, ఎల్‌.ఐ.సి
పాత పెన్షన్‌ పునరుద్ధరణ జరగాల్సిందే
ఉద్యోగం విరమణ అనంతర జీవితం కష్టంగా ఉందా? సుఖంగా ఉందా? అంటే ఉద్యోగం చేస్తున్న కాలంలో ఆ పెన్షనర్‌ జీవనవిధానాన్ని బట్టి అంచనా వేయవలసి వస్తుంది. ఇది వ్యక్తిగత, వత్తి గత, కుటుంబ జీవితానికి అన్నింటికి సంబంధించి అనుభవాలతో అరవై ఏళ్ల తరువాతి జీవితాన్ని అంచనా వేయాలి…. మామూలుగా కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించి ఆచరించిన టైర్లు తమ భవిష్యత్‌ గురించి ఆలోచించరు. పిల్లలను ప్రేమతో, బాధ్యతతో వారి బంగారు భవిష్యత్తు గురించి తమ సర్వస్వం ధారపోసి పెంచుతున్నాం కాబట్టి తమ వయసు ఉడికిన నాడు పిల్లలు చూసుకుంటారని ధీమాతో ఉంటారు… అయితే ఆ భావన నాలుగు, ఐదు శాతానికి మించి ఆచరణలోకి రావడం లేదనేది వాస్తవం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లక్షణాలను ఈ ఆధునిక కాలంలోనూ అమలు అవుతాయన్న భ్రమలను వదిలించుకొని తమ పిల్లలకు, తమ తల్లిదండ్రులకు బాధ్యతగా చేయవలసింది చేస్తూనే భార్యాభర్తలు తమ ఉద్యోగానంతర జీవితానికి భధ్రమైన ఏర్పాటు (ఆర్థిక, శారీరక, మానసిక దఢత్వం సమకూర్చుకోవడం) చేసుకోవడం అత్యవసరం. అది లేని నాడు పెన్షన్‌ పొందుతున్నా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వచ్చినా ఫలితం లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపు నిండా తిండి, బట్ట, అనారోగ్యాలకు చికిత్స కరువై అల్లాడుతున్నారు. మనవలు, మనవరాళ్ళతో మిగిలిన జీవితం కాలక్షేపం చేద్దామనుకుంటే ఆ ఆశా లేక బలవంతంగా పేగు బంధాన్ని తెంచుకుని వద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. భారతదేశంలో ప్రపంచీకరణతో వచ్చిన ప్రమాదాల్లో హక్కులు తప్ప బాధ్యత లేని కారణంగా కుటుంబ వ్యవస్థ కూడా కుప్ప కూలుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు పొంది భరోసాతో జీవితం గడిపిన తరాలు వద్ధాప్య దశకు చేరితే వారి పిల్లలు భరోసా, భద్రత లేని అరకొర వేతనాలతో (నిరుద్యోగ భారతం నానాటికీ పెరుగుతున్నది చూస్తున్నాం కదా). తాము కన్నవాళ్ళకే సరైన పోషణ ఇవ్వలేని స్థితిలో తమను కన్నవారిని చూడలేకపోవడమే కాకుండా వాళ్ళకు వచ్చే పింఛన్లు కూడా వాడుకునే స్థితిలో నేటి తరం ఉన్నారు. నేడు ఇదొక విషాద వాస్తవం.
కేంద్ర పాలకులైన కాంగ్రెస్‌, బీజేపీలు పెన్షన్‌ ఉద్యోగుల హక్కు భిక్ష కాదు అన్న వాస్తవాన్ని పక్కకు పెట్టి మందబలంతో అశాస్త్రీయ విధానాలతో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ఈ దేశంలోని కోట్లాది ఉద్యోగులపైన బలవంతంగా రుద్ది, వారి కుటుంబాలను ఆగం చేశారు. దేశాభివద్ధికి చోదక శక్తులుగా, సైనికులుగా, సేవకులుగా నాలుగైదు దశాబ్దాల పాటు తమ సర్వ శక్తి సామర్థ్యాలను అర్పించిన వారికి కొత్త పెన్షన్‌ విధానంతో బతికుండగానే పాడె గట్టిన స్థితిని కల్పించారు. 2003 నుంచి 2013 వరకూ పీ.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ. బిల్లు చట్టం కాకుండా ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మికుల పక్షాన పార్లమెంటులో నిర్విరామ కషి చేసింది వామపక్ష సభ్యులు. వారు బలహీన పడగానే గోతికాడ నక్కలా కాచుక్కూర్చుని పెన్షన్‌ ఫండ్‌ తో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్న అస్మదీయులకు మేలు చేసేందుకు సిద్ధమని బీజేపీ, సహకరించిన కాంగ్రెస్‌ కారణంగా న్యూ పెన్షన్‌ అంటే నో పెన్షన్‌ తీసుకొచ్చారు. చట్ట రూపం దాల్చిన 2013 నుంచి కాకుండా 2004 జనవరి ఒకటి నుంచే అమలుకు పూనుకోవడం మరొక దుర్మార్గం. కొత్త పెన్షన్‌ అమలు కారణంగా ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబ పెన్షన్‌ వెయ్యి, పదిహేను వందలు మాత్రమే అందుకుంటున్నారు అంటే ఎంతో దుర్మార్గమైన విధానం ఇది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగం తప్ప ఉద్యోగాల ఊసే లేదు కాబట్టి కనీసం అంతకు ముందు పదేళల్లో ఉద్యోగంలో చేరిన వారికైనా పాత పెన్షన్‌ సౌకర్యం ఉండేది. ఇదీ దేశభక్త బీజేపీ నిర్వాకం.
దేశంలో అత్యుత్సాహంతో కొత్త పెన్షన్‌ విధానాన్ని ఆమోదించింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం. పాత పెన్షన్‌ ను పునరుద్ధరించాలని దశాబ్దకాలంగా జరుగుతున్న పెన్షనర్ల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాల ఒత్తిడికి అనివార్యంగా తొలొగ్గిన హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ గడ్‌, పంజాబ్‌ మొదలైన రాష్ట్రాలు తమ శాసన సభల ఆమోదంతో కొత్త పెన్షన్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి లేఖలు పంపితే పీ.ఎఫ్‌.ఆర్‌.డీ.ఏ చట్టంలో వెనక్కి వచ్చే అవకాశం లేదనీ, కాంట్రీబ్యూటరీ పెన్షన్‌లో రాష్ట్రాలు జమచేసిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేమనీ కేంద్రం చెప్తున్నది. ఎంత వంచన… దేశ సంపదను అప్పులు రూపేణా తీసుకున్న కార్పొరేట్లకు కోట్లాదిగా మాఫీ చేయగలిగిన పాలకులు, ఉద్యోగుల సొమ్ముతో వ్యాపారం చేస్తూ కొత్త పెన్షన్‌ పథకం నుంచి విరమించుకునే అవకాశం లేదని చెప్పడం అంటే… ఇంత కన్నా మోసం, దగా ఇంకొక ఉంటుందా!
ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మానిఫెస్టోలో చెప్పినట్లు పాక్‌ పెన్షన్‌ పునరుద్ధరణపై మాట నిలబెట్టుకోవలసి ఉంది. రేపటి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు కానీ. 24ల జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు కానీ, అతి ముఖ్యమైన సమస్యలతో పాటు పాత పెన్షన్‌ పునరుద్ధరణ అన్ని పార్టీలు మానిఫెస్టోల్లో ఒక ప్రధాన అంశంగా ఉండాలని, లేనట్లయితే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని దేశ వ్యాప్త పెన్షనర్‌ సంఘాలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. గత నెల నవంబర్‌ 4 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ, రామ్‌ లీలా మైదానంలో లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మిక,పెన్షనర్ల మహాధర్నా తమ ఉద్యమపోరును ఉధతం చేస్తామని ప్రకటించింది. కొత్త పెన్షన్‌ రద్దు – పాత పెన్షన్‌ పునరుద్ధరణ జరగాల్సిందే.
– మోతుకూరి సంయుక్త

Spread the love