మళ్లీ అధికారం మాదే

Again the power is ours– 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్‌ కావాలా?
–  3 గంటలు విద్యుత్‌ చాలన్న కాంగ్రెస్‌ కావాలి : మండలిలో కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదేనని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో అనుమానం అవసరం లేదనీ, మూడోసారి సీఎంగా కేసీఆర్‌ అవుతారని స్పషం చేశారు. ఆదివారం శాసనమండలిలో ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సమాధానమిస్తూ కేసీఆర్‌ కారణజన్ముడని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తున్నారని అన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయనీ, 24 గంటల కరెంటును ఉచితంగా ఇచ్చే కేసీఆర్‌ కావాలా?, మూడు గంటల విద్యుత్‌ చాలన్న కాంగ్రెస్‌ కావాలా? తేల్చుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసిన కేసీఆర్‌ కావాలా? వద్దా? ఆలోచించాలని సూచించారు. ధరణి ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో సమగ్ర, సమతుల్యత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధాని మోడీ అంటున్నారని విమర్శించారు. కానీ కార్పొరేట్‌ దోస్తులకు రూ.12 లక్షల కోట్లు కేంద్రం రాయితీలిచ్చిందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళికి రూ.వెయ్యి కోట్లు బోనస్‌ ప్రకటిస్తామని చెప్పారు. సుస్థిరమైన పాలన, పటిష్టమైన నాయకత్వం అవసరమని అన్నారు. పదవుల కోసం కొట్లాడే వాళ్లు ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి ఎవరోస్తారోనని అన్నారు. ఇందులో అనుమానం ఎందుకనీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హతమయ్యాడు. రాజౌరీ జిల్లాలోని బరియామా ప్రాంతంలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల కోసం గాలింపు చేపట్టాయి.

Spread the love