వ్యవసాయ కార్మిక సంఘం ఉత్తర తెలంగాణ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభం

– వ్యకాస రైతుబంధులా కూలీలకు కూలి బందు ఇవ్వాలి
నవతెలంగాణ – కంటేశ్వర్
వ్యవసాయ కార్మిక సంఘం ఉత్తర తెలంగాణ రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక బసవ గార్డెన్లో ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు భూతం సారంగపాణి  జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు లంకా రాఘవులు  మాట్లాడటం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ నీ తగ్గించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వ్యకాస నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు  మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో కూలీలు అత్యధికంగా ఉన్నారని వారికి రైతుబంధులా కూలి బంధును కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అన్నారు. అదేవిధంగా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి కనీస వేతన చట్టాన్ని సవరించి కూలీలకు ప్రతి రోజుకు 600 రూపాయల చొప్పున ఇవ్వాలని చట్టం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు వసతులు కల్పించాలి అని అన్నారు. ప్రభుత్వాలు కూలీల సమస్యలు పరిష్కరించాలని లేని యెడల పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లా బాధ్యులు నాయకులు పాల్గొన్నారు.

Spread the love