నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని తిప్పాపూర్, భిక్కనూర్ గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాల్ తుమ్మెద ఏరువాక కేంద్రం నుండి వచ్చిన ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏనుగు అనిల్ రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో వరి, మొక్కజొన్న, శనగ కూరగాయల పంటలను ప్రధానంగా సాగు చేయాలని, వరి పంటలో అక్కడక్కడ మోగి పురుగు, ఇతర చీడపురుగుల నుండి పంటలను కాపాడడానికి వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాధా, ఏఈవోలు రవి, వినోద్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, రైతులు పాల్గొన్నారు.