ఆహా అనేలా సీజన్‌ 3

ఆహా అనేలా సీజన్‌ 3ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్‌ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్‌తో మన ముందుకు రానుంది. జూన్‌ 7 నుంచి ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 ఆహాలో ప్రేక్షకులను అలరించనుంది. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 గ్రాండ్‌ లాంచ్‌ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో…హోస్ట్‌ శ్రీరామ్‌ చంద్ర మాట్లాడుతూ, ”ఇండియన్‌ ఐడల్‌ 3′ సీజన్‌లో మళ్లీ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌కు సంబంధించిన ఆడిషన్స్‌ జరిగినప్పుడు కేవలం సింగర్స్‌ మాత్రమే కాదు.. చాలా మంది సంగీత కళకారులు ఇందులో పార్టిసిపేట్‌ చేశారు. ఈ సీజన్‌ 3తో గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతున్నారు’ అని తెలిపారు. ”ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2 చేసిన తర్వాత సీజన్‌ 3కి కాల్‌ వస్తుందని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్‌ వచ్చింది. సీజన్‌ 3కి చక్కగా ఆడిషన్స్‌ ముగిశాయి. మంచి కంటెస్టెంట్స్‌ వచ్చారు. గత సీజన్స్‌లాగా ఈ సీజన్‌లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదికను ఎలా ఉపయోగించుకుని ప్రతిభను చాటుకుంటారో చూడాలి. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 చాలా చాలా బావుంటుంది’ అని సింగర్‌ గీతా మాధురి చెప్పారు. ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌3లో యంగ్‌ టాలెంటెడ్‌ సింగర్స్‌ మాత్రమే కాదు, ఏదో సాధించాలనే తపన ఉన్నవాళ్లు వచ్చారు. సీజన్‌ 3 చాలా మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుంది’ అని సింగర్‌ కార్తీక్‌ చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ, ‘గత రెండు సీజన్స్‌ కంటే ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3లో వరల్డ్‌ వైడ్‌ మ్యూజిక్‌ కంటెస్టెంట్స్‌ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్‌ సింగర్స్‌ను ఎంపిక చేశాం. సీజన్‌ 3 నుంచి గొప్ప టాలెంట్‌ మన ముందుకు రాబోతుంది. ఇది మాకు ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌’ అని అన్నారు.

Spread the love