సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. దర్శకులు బుచ్చిబాబు, కార్తిక్ దండు, శ్రీనివాస్ అవసరాల, రైటర్ ప్రసన్న ఈ వేడుకలో పాల్గొన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ,’సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. అంత ఆర్గానిక్‌గా ఉంది. తన నటన చూస్తున్నాను. ఆయా పాత్రల్లో ఇమిడిపోతాడు. మా అర్జున్ మంచి లాజిక్‌తో ప్రసన్న వదనం తీసాడు. ఈ సినిమా చూశాను. చాలా బావుంది. అంత చక్కగా తీశాడు’ అని తెలిపారు.