రైతు నాయకుడి మృతికి నివాళిగా ఎర్రపతాకం అవనతం
రాబోయే తరాల కార్యకర్తలకు ఆయన స్ఫూర్తి
ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
న్యూఢిల్లీ : అగ్రశ్రేణి రైతు నాయకుడు, ఏఐకేఎస్ మాజీ ఉపాధ్యక్షుడు, ఐదు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రైతు సంఘంలో ప్రముఖ నాయకుడిగా ఉన్న కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం పట్ల అఖిల భారత కిసాన్ సభ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కామ్రేడ్ మల్లారెడ్డి కుటుంబానికి, కిసాన్ ఉద్యమ సహచరులకు, కార్యకర్తలకు , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. అంకితభావంతో కూడిన జీవితం, అపారమైన అనుభవం , రైతాంగ అభ్యున్నతి పట్ల సారంపల్లికి ఉన్న అచంచలమైన అంకితభావం, రాబోయే తరాల కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ సోమవారమొక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి నివాళిగా ఏఐకేఎస్ ఎర్రపతాకాన్ని అవనతం చేసింది.‘‘1939 ఆగస్టు 25న జన్మించిన కామ్రేడ్ మల్లారెడ్డి తన జీవితాన్ని పూర్తిగా శ్రామిక ప్రజలు , రైతాంగం యొక్క అభ్యున్నతికి అంకితం చేశారు. ఆయన 1973లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారి, నర్సంపేట ప్రాంతంలో, వరంగల్ , అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంతటా రైతు ఉద్యమాన్ని నిర్మించడంలో మార్గదర్శక పాత్ర పోషించారు. దశాబ్దాల పాటు రైతు సంఘంతో ఆయన అనుబంధం కలిగి, డివిజనల్, జిల్లా , రాష్ట్ర స్థాయిలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా , రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2003 నుంచి 2022 వరకు ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు’’ అని వారు తెలిపారు.
సారంపల్లికి ఏఐకేఎస్ రెడ్ సెల్యూట్
- Advertisement -
- Advertisement -



