నా పై వచ్చేవి ఆరోపణలు మాత్రమే..

– అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలే..
– నన్ను నమ్మండి…
– మీకు సేవకుడిని అవుతా…
– కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజనేతర వ్యతిరేకిని అని నా పై కొందరు కక్ష సాధింపు చర్యల్లో కొందరు ఆరోపణలు చేస్తూ,అపోహలు సృష్టిస్తున్నారు.అవి అన్నీ రాజకీయ కక్ష సాధింపు లే తప్ప అందులో నిజం లేదని, నన్ను నమ్మండి,నేను మీకు సేవకుడిని అవుతా అంటూ అశ్వారావుపేట కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ ఉద్వేగభరిత ఉపన్యాసం చేసారు. ఆయన శుక్రవారం స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి పోటీ చేశానని,నేడు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నా అన్నారు. ఎఐసిసి నా పై ఎన్నో సర్వేలు చేసి నేను గెలుస్తానని నాకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించి నందుకు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి,బట్టి విక్రమార్క కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కక్షతో కొంతమంది నా పై అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు అని,అవేవీ నిజం కాదు అని అన్నారు. రాజకీయాల్లో డబ్బు,రాజకీయ పలుకుబడి ఉండాలి కాని ఆ రెండు ప్రస్తుతానికి నాకు లేవు అని ఆవేదన వ్యక్తం చేసారు.తనను గెలిపిస్తే  అశ్వారావుపేట పరపతి ని, అభివృద్ధి ని ఢిల్లీ స్థాయికి తీసుకు వెళ్తా అన్నారు. ఢిల్లీ స్థాయిలో అశ్వారావుపేట పెరు వినిపించేలా అభివృద్ధికి తోడ్పడతామని అని అన్నారు. నా ఫోటోలు పెట్టుకొని నన్ను తలుచుకునే విధంగా కొన్ని కుటుంబాలు ఇప్పటికే ఉన్నాయని,వాటిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఖమ్మం జిల్లాలో పదికి పదికి సీట్లు వస్తాయని చెప్పడంతో పొంగులేటి ని గెలవనీయకూడదని ఐటి దాడులు చేస్తున్నారు అని అభిప్రాయపడ్డారు. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ స్వార్థం కోసం పామ్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ని సిద్దిపేట లో పెట్టడానికి సిద్ధం చేశారు అని,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ఫ్యాక్టరీ ని సిద్దిపేట నుండి అశ్వారావుపేట కు తీసుకొస్తాను అని బరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన మిగిలిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు,సుంకవల్లి వీరభద్రరావు,బండి పుల్లారావు,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,బత్తిన పార్ధసారధి,కే.పి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love