రైతంగానికి యూరియా అవసరమైనంత సరఫర చేయాలి ..అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం

నవతెలంగాణ- ఆర్మూర్
రైతాంగానికి యూరియా అవసరమైనంత సరఫరా చేయాలి,,, వర్షాభావం వల్ల అన్ని రకాల పంటల దిగుబడి తగ్గినందువల్ల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.. అని ఏ ఐ పి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సోమవారం  మార్క్స్ భవన్ హైదరాబాదులో కామ్రేడ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది ..,,,, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు అవకాశం కల్పించడంతోపాటు మార్క్ఫెడ్ అధికారులు యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులకు అందుబాటులో తీసుకురావకపోవడంతో సుమారుగా మూడు లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడిందని దీనికి తోడుగా యూరియా కొనుగోలు చేసిన రైతుకు ఇతర ఎరువులు తీసుకుంటే తప్ప యూరియా ఇవ్వమని ఒక శరతు విధించడం సమంజసం కాదని సమావేశం అభిప్రాయం పడింది. సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేసింది రాష్ట్రంలో వర్షాభావంతో పంటల దిగుబడి 30% తగ్గిందని రైతులు, నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయి,, దిగుబడి తగ్గిన అన్ని పంటలకు వ్యవసాయ అధికారులతో సర్వే జరిపించి తగ్గిన దిగుబడి పంటలకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కార్యవర్గం తీర్మానించింది.. జిల్లాలో నకిలీ సోయా విత్తనాలు సరఫరా చేసిన కరిష్మా,, బాహుబలి,,, అంకుర్,, మైక్రో11.. శుభం… బెసార వెరైటీ విత్తనాలను సుమారుగా 50వేల ఒక వంద పన్నెండు ఎకరాలకు ఇచ్చి ప్రతి రైతుకు ఎకరానా 15 వేల నుంచి 20 వేల నష్టాన్ని కలిగించారు.. వ్యాపారులపై పిడి చట్టాన్ని నమోదు చేసి శిక్షించాలని ,,, చేత రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్డిమాండ్ చేసింది సమావేశం.,,,,, ఏకకాలంలో బ్యాంక్ అప్పులను, ప్రవేట్ అప్పులను వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేసింది..,,,, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని,,, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన పంటలకు వర్తించే విధంగా,,, అన్ని రకాల పంటలను బీమా పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది..ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్.. ఉపాధ్యక్షులు కే.. రంగన్న… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..V. ప్రభాకర్… పై తీర్మానాలను అమలు చేయించుకోవడానికి రాష్ట్ర,, కేంద్ర,, ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావడానికి అక్టోబర్ మొదటి వారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు పునుకోవాలని పిలుపునిచ్చారు..మరోవైపు రైతుబంధు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు.. వందలఎకరాల భూస్వాములకు ఇస్తూ సుమారుగా 6000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం వృధా చేస్తుందని విమర్శించారు.. పోడు భూములను అర్హులైన వారందరికీ ఇవ్వాలని.. ఒకవైపు 10 ఎకరాల వరకు కబ్జాలో ఉన్నవారికి పట్టా ఇవ్వాలని సూచించినప్పటికీ ఆదివాసి, గిరిజన కుటుంబాలు 5,,, 6 ఎకరాల కబ్జాలో ఉన్న వారికి కేవలం,, ఆరెకరము,, ఎకరం పట్టా ఇచ్చి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సంఘాన్ని బలోపేతం చేయడానికి మండల డివిజన్ గ్రామ కమిటీల నిర్మాణానికి పునుకోవాలని పటిష్టం చేయాలని కోరారు.
Spread the love