నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామాలలో నేడు ఎస్ ఐ ఆర్ పై జరిగే గ్రామసభల్లో ప్రతి ఓటరు పాల్గొనాలని ఎమ్మార్వో ఉమలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్, ప్రజా ప్రతినిధులతో పాటు బిఎల్వోలు, సూపర్వైజర్లు, అధికారుల సమక్షంలో నిర్వహించే ఈ సమావేశంలో ఓటరు జాబితా లో ఉన్న పేర్లను బహిర్గతంగా వినిపించడం, జాబితా పేరు నమోదు కాని పౌరులను గుర్తించడం, 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం, జాబితాలో తప్పులు ఉంటే సవరణ దరఖాస్తు చేసుకోవడం, అనర్హుల పేర్లు ఉంటే అభ్యంతరం తెలపడం, క్లైములు, అభ్యంతరాల పై, ఈసీఐ సూచించిన పత్రాలపై చర్చ, ఎస్ ఐ ఆర్ కు సంబంధించిన ఇతర అంశాలపై గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎస్ ఐ ఆర్ గ్రామసభలో ఓటర్లందరూ పాల్గొనాలి: తహసిల్దార్ ఉమలతా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


