అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభించారు. అయితే, కేవలం పహల్గామ్‌ మార్గంలో మాత్రమే యాత్ర మొదలైంది. బల్తాల్‌ మార్గంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో యాత్రను ఇంకా ప్రారంభించలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా గత శుక్రవారం నుంచి మూడు రోజులుగా యాత్ర నిలిచిపోయింది. అప్పటికి కేవలం ఆరు రోజులు మాత్రమే యాత్ర కొనసాగింది. ఆ ఆరు రోజుల్లో 67,566 మంది భక్తులు పవిత్ర మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జూలై 1న మొదలైన యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

Spread the love