నూతన సాంకేతిక విధానంతో అద్భుతమైన నిర్మాణాలు

– ప్రతి మెటీరియల్‌ శాస్త్ర సాంకేతిక పరిశోధనా విధానంతో రూపొందించినవే
– ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రామేశ్వర్‌ రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజనీరింగ్‌ రంగంలో వ్యవసాయం మొదలు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏరోనాటిక్స్‌, కెమికల్‌, కంప్యూటర్‌, బయోటెక్‌ తదితర అనేక శాస్త్రాలు వున్నప్ప టీకీ, తరతరాలుగా సివిల్‌ ఇంజనీరింగ్‌ శాస్త్రాన్ని మాత్రం ఉపయోగిస్తున్నారని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌ రావు అన్నారు. ప్రపంచంలోని గుడులు, గోపురాలు, వంతెనలు, కోటలు ఏవైనా కావచ్చు వాటిని సివిల్‌ ఇంజనీరింగ్‌ పద్ధతుల్లోనే నిర్మాణాలు జరిగాయని అభిప్రాయపడ్డారు. భూమిపైన వున్న అన్ని నిర్మాణాలు సివిల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీతోనే నిర్మించబడ్డాయని తెలిపారు. ‘అడ్వాన్సుడ్‌ కన్స్‌ట్రక్షన్‌ మెటీరియల్స్‌ ఇన్‌ కాంక్రీట్‌ టెక్నాలజీ అండ్‌ ఇట్స్‌ అప్లికే షన్స్‌’ పై గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ అఫ్‌ ఇండియాలో బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో రామేశ్వర్‌ రావు ప్రధాన వక్తగామాట్లాడారు. నిర్మాణాల్లో ఉపయోగి స్తున్న స్టీల్‌, సిమెంట్‌తోపాటుగా ఇందులో ఉపయోగిస్తున్న ప్రతి మెటీరియల్‌ శాస్త్ర సాంకేతిక పరిశోధనా విధానంతో రూపొందించడం వలన అద్భుతమైన నిర్మాణాలకు ఆవిష్క రణలు జరుగుతున్నాయని, సివిల్‌ నిర్మాణ రంగంలో ఇదొక గొప్ప మైలు రాయని ఆయన అన్నారు. కాంక్రీట్‌ నిర్మాణాలు ప్రకతికి విద్రోహంగా ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవశ్రీ ఇస్పాత్‌ లిమిటెడ్‌ టెక్నీకల్‌ మార్కెటింగ్‌ హెడ్‌ రాజీవ్‌ సింగ్‌ బిస్త్‌ మాట్లాడుతూ భారీ కాంక్రీట్‌ నిర్మాణాల వలన ప్రకతికి ఎలాంటి హానీ కలగకుండా ఆయా నిర్మాణా లు మరింత ఎక్కువ కాలం నిలబడే లాగా ప్రస్తుత నిర్మాణా లు జరుగుతున్నాయన్నారు. బిల్డింగ్‌ మెటీరియల్‌లో నూతన శాస్త్ర సాంకేతిక విధానాలు వస్తున్నాయన్నారు. అనంతరం ఎస్‌.కె. శర్మ ఇంజనీరింగ్‌ కంపెనీలో పనిచేస్తున్న సి.హెచ్‌ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఒకసారి వాడిన మెటీరియల్‌ రిసైకిల్‌ చేసే విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ అండ్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ ఫ్యాకల్టీ హెడ్‌ డాక్టర్‌ డి. ఆదినారాయణ, సి.హెచ్‌, తిలక్‌, ఎల్‌. శ్వేతతో పాటు నగరంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love