సీనియర్‌ ఉద్యోగులకు అమెజాన్‌ మొండి చెయ్యి

న్యూయార్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో పని చేసే సీని యర్‌ ఉద్యోగులను ఆ కంపెనీ నిరాశపర్చనుందని సమాచారం. వారి మూల వేతనంలో ఎలాంటి పెంపు చేపట్టరాదని భావిస్తోందని రిపోర్టులు వసున్నాయి.గత ఏడాది కాలంగా అమెజాన్‌ షేర్‌ ధర పెరగడంతో పలువు రు ఉద్యోగుల మొత్తం వేతనం ముందుగా అనుకున్న దాని కంటే భారీగా పెరుగుతున్నదని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. దీంతో అమెజాన్‌ ప్రధానంగా స్టాక్‌ ఆప్షన్‌ల కంటే వేతనంపై ఆధారపడిన ఉద్యోగులకు మాత్రమే నగదు రూపంలో వేతన ప్రయోజనాలను అందించడంపై దృష్టి సారిస్తోందన్నారు.

Spread the love