”అణుయుద్ధంతో పశ్చిమ దేశాల సరసాలు”

West's flirtation with nuclear warపాశ్చాత్య దేశాల నాయకులు తాము అణుయుద్ధ భూతాన్ని ఆహ్వానిస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం మాస్కోలో శాసనసభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హెచ్చరించాడు. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలు ప్రేరేపిస్తున్నాయని ఆయన మరోసారి ఆరోపించాడు. పుతిన్‌ తన వార్షిక స్టేట్‌ ఆఫ్‌ ది నేషన్‌ ప్రసంగ ప్రారంభ నిమిషాలలో ఈ అంశాన్ని ప్రస్తావించాడు. పుతిన్‌ తన ప్రణాళికలను, ప్రాధాన్యతలను రష్యా ఫెడరల్‌ అసెంబ్లీ, జాతీయ శాసనసభకు చెందిన ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం లో ప్రకటించాడు.. నాటో దేశాలపై దాడి చేయాలని రష్యా యోచిస్తోందని పాశ్చాత్య నాయకులు ఇటీవల చేస్తున్న వాదనలు ”అర్ధం లేనివి” అని అధ్యక్షుడు పుతిన్‌ నొక్కి చెప్పాడు. అదే సమయంలో అవే దేశాలు ”మా భూభాగంపై దాడులు చేయడానికి లక్ష్యాలను ఎంచుకుంటు న్నాయి” అని రష్యా దేశాధినేత ఆరోపించాడు. ఇప్పుడు ”నాటో సైనిక దళాలను ఉక్రెయిన్‌లో మోహరించడం” గురించి చర్చ జరుగుతోంది. రష్యాను జయించటానికి గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పుతిన్‌ గుర్తు చేశాడు. ”ఇప్పుడు సంభావ్య ఆక్రమణ దారులకు పరిణామాలు చాలా విషాదకరంగా ఉంటాయి” అని ఆయన హెచ్చరించాడు. రష్యాలో భారీ అణు ఆయుధాగారం ఉందని, అది ఎల్లవేళలా ”ఉపయోగించు కోవటానికి పూర్తి సంసిద్ధత”లో ఉంటుందని ఆయన అన్నాడు. బాధ్యతారహితంగా ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలను చేసే పాశ్చాత్య రాజకీయ నాయకు లు ”యుద్ధం అంటే ఏమిటో ఇప్పటికే మర్చిపో యారు” అని రష్యా అధ్యక్షుడు అన్నాడు. ఇటీవలి దశాబ్దాలలో ”కఠిన పరీక్షలను” ఎదు ర్కొన్న రష్యన్ల మాదిరిగా కాక, పాశ్చాత్యులు ”యుద్ధం అంటే కొన్ని కార్టూన్లు మాత్రమే అని అనుకుంటున్నారు” అని అధ్య క్షుడు పుతిన్‌ అభిప్రాయపడ్డాడు.”పరిస్థితులను బట్టి చూస్తే మేము దేనినీ మినహాయించ లేము” అని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్‌ మక్రాన్‌ ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల సైన్యాలను పంపటం గురించి మాట్లాడిన తరువాత పుతిన్‌ అలా వ్యాఖ్యానించాడు.
అయితే నాటో దేశాల నాయకులు మక్రాన్‌ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ”ఉక్రెయిన్‌లో నాటో సైన్యాన్ని ప్రవేశపెట్టే ఆలో చనగానీ, అందుకు సంబంధించి ఎటు వంటి ప్రణాళికలుగానీ లేవు” అని నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ నొక్కి చెప్పాడు. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులో కూడా ”ఉక్రేనియన్‌ గడ్డపై నాటో దేశాల సైనికులు ఉండరని, వారిని యూరోపియన్‌ దేశాలు అక్కడికి పంపవు” అని జర్మన్‌ ఛాన్స లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ ప్రకటించాడు. పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల నాయ కులు కూడా ఇదే విధమైన ప్రకటనలను చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో సైనిక దళాలు పాల్గొనటాన్ని తోసిపుచ్చలేమని మక్రాన్‌ చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానిస్తూ ”అటువంటి పరిణామంతో నాటో, రష్యాల మధ్య పూర్తి స్థాయి సైనిక ఘర్షణ జరిగే సంభావ్యత గురించి కాక దాని అనివార్యత గురించి మాట్లాడవలసి ఉంటుంది” అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ హెచ్చరించాడు.

Spread the love