బీజేపీకి కాలం చెల్లింది..రాష్ర్టపతి పాలన పెట్టాల్సిందే: జైరాం రమేష్

నవతెలంగాణ – హర్యానా: హర్యానాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. బీజేపీ మెజారిటీ కోల్పోయింది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ సీనియన్ లీడర్ జైరాం రమేశ్ హర్యానా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనకు ఇదే సరైన సమయం అని తెలిపారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో హర్యానా ప్రభుత్వం స్పష్టంగా మెజారిటీని కోల్పోయిందని అన్నారు. లేదంటే బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంది. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నో పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది. ఢిల్లీలో బీజేపీ రోజులు పోయినట్లే.. హర్యానాలో కూడా బీజేపీకి కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు జైరాం రమేశ్.

Spread the love