కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా?

Professor Kodandaram– ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతిష్టాత్మక నిర్మాణంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రణాళిక, నాణ్యత, డేసైన్‌, నిర్వహణ లోపం కారణంగా రాష్ట్రంలో సాగు, ఇంజినీరింగ్‌, ఆర్థిక సంక్షోభం తలెత్తిందని తెలిపారు. కేవలం మూడు పిల్లర్ల కు సంబంధించిన సమస్యగా దీన్ని బీఆర్‌ఎస్‌ నమ్మించే ప్రయత్నం చేస్తున్న దనీ, కానీ ఆ ప్రాజెక్టుకు తలకాయ వంటి మేడిగడ్డ దెబ్బతినడమంటే మొత్తం ప్రయోజనమే ప్రశ్నార్థకంగా మారినట్టేనని విమర్శించారు. 18 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేం దుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం సీడబ్ల్యూసీ హెచ్చరికలను బేఖాతరు చేసిందని వాపోయారు. రాష్ట్రం ఉత్పత్తి చేసే విద్యుత్‌ లో 60 శాతం ఒక్క కాళేశ్వరానికే ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. మిలియన్‌ మార్చ్‌ దినోత్సవమైన మార్చి 10న నీళ్లు – నిధులపై టీజేఎస్‌ ఓపెన్‌ డిబేట్‌ నిర్వహిస్తున్నదని తెలిపారు. చర్చకు రావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈ సందర్భంగా కోదండరాం సవాల్‌ విసిరారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ పీ.ఎల్‌.విశ్వేశ్వర్‌ రావు, ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌ పాల్గొన్నారు.

Spread the love