ట్రంప్‌ ”విచారణ నుంచి మినహాయింపు” హక్కును సమీక్షించనున్న సుప్రీంకోర్టు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఫెడరల్‌ ఎన్నికల జోక్యం కేసులో న్యాయమూర్తులు తీర్పు ఇచ్చే వరకు విచారణను నిలిపివేస్తూ న్యాయపరమైన మినహాయింపును పొందాలా వద్దా అనే దానిపై వాదనలు వినడానికి అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేయటానికి ప్రయత్నించాడని ట్రంప్‌పై వచ్చిన ఆరోపణ లకు సంబంధించి విచారణను ఎదుర్కోవచ్చా లేదా అనే విషయాన్ని సమీక్షిస్తామని కోర్టు తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించింది. మాజీ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ కూడా అయిన అమెరికా మాజీ అధ్యక్షుడు తనకు ప్రెసిడెన్షి యల్‌ ఇమ్యూనిటీ ద్వారా రక్షణ కల్పించాలని పట్టుబట్టాడు. ఈ వాదనను ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు తిరస్కరించారు. ట్రంప్‌ ఒక సోషల్‌ మీడియా పోస్టులో ఈ చర్యను ప్రశంసించి, సుప్రీంకోర్టుకు ”చాలా కతజ్ఞతలు” అని చెప్పాడు. ”ప్రెసిడెన్షి యల్‌ ఇమ్యూనిటీ లేకుండా, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా ప్రయోజనాల కోసం అధ్యక్షు డు సరిగ్గా పనిచేయలేడు లేదా నిర్ణయాలు తీసుకోలేడు” అని ఆయన ఆ పోస్టులో రాశాడు. ”అధ్యక్షులు పదవిని విడిచిపెట్టిన తర్వాత తప్పుడు ప్రాసిక్యూషన్‌, ప్రతీకారాల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతారు, ఒక్కోసారి పక్షవాతానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవంలో ప్రెసిడెంట్‌ను దోపిడీ చేయటానికి, బ్లాక్‌ మెయిల్‌ చేయటానికి కూడా దారితీయొచ్చు” అని ట్రంప్‌ రాశాడు. వేగవంతమైన షెడ్యూల్‌ ను సెట్‌ చేసిన సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 22 నుండి మౌఖిక వాదనలను వింటుంది. జూన్‌ లో కోర్టు తీర్పు రావచ్చని భావిస్తున్నారు. ఒక మాజీ అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు చేసిన చట్టవిరుద్ధమైన చర్యల నుండి రక్షణ ఉంటుందా లేక ఉండదా అనే దానిపై దేశ అత్యున్నత న్యాయస్థానం అమెరికా చరిత్రలోనే మొదటి సారి ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఆ విధంగా డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా చరిత్రలోనే వైట్‌ హౌస్‌ను విడిచిపెట్టిన తర్వాత నేరారోపణలు ఎదుర్కొంటున్న మొట్టమొదటి మాజీ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ అవుతాడు.

Spread the love