భారత్‌కు జంక్‌ఫుడ్‌ ముప్పు

Junk food is a threat to India– ‘అనారోగ్యకరమైన ఆహారంతో 50 శాతానికి పైగా వ్యాధులు’
ఆధునిక జీవనశైలితో వస్తున్న మార్పులు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పల్లెలు వదిలి నగరాలకు రావడం పెరుగుతోంది. అంతేకాదు… గతంతో పోలిస్తే పల్లెల్లోనూ నగరీకరణ పోకడలు పెరిగాయి. దాంతో పట్టణాల్లోనే కాదు… పల్లెల్లోనూ కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గడం, ఆటలాడటానికి అనువైన స్థలాల లేమి వంటివి పెరిగాయి. ఇలాంటి మరెన్నో కారణాలు అనారోగ్యానికి చేర్చుతున్నాయి.

న్యూఢిల్లీ: దేశ జనాభాలో 56 శాతానికి పైగా అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వల్లనే అనారోగ్యం బారిన పడుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి, జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్‌..ఎన్‌ఐఓఎన్‌) పేర్కొన్నాయి. పోషకాహార లోపాలను నివారించడానికి బుధవారం 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేశాయి.
ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే శారీరక శ్రమ కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, హైపర్‌టెన్షన్‌ను తగ్గించగలదు. టైప్‌ 2 డయాబెటిస్‌ను 80 శాతం వరకు నివారి స్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అకాల మరణాలను నివారించవచ్చునని హైదరాబాద్‌ ఆధారిత సంస్థ తెలిపింది.
చక్కెర, కొవ్వులతో కూడిన అత్యంత ప్రాసెస్‌ చేయబడిన ఆహారాల వినియోగం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్యలు తీవ్రతరం చేస్తాయి. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కంటే అనారోగ్యకరమైన, అధిక ప్రాసెస్‌ చేసిన, అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఆహారాలు చవక పదార్థాలు అందుబాటులో ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు, చిక్కుళ్లు, పచ్చి ఆకు కూరలు, వేర్లు, దుంపలు , పండ్లు, పాలు రోజుకు సిఫారసు చేసిన ఆహారాలలో సగం ప్లేట్‌లో ఉండాలి. ఇతర ప్రధాన భాగాన్ని తృణధాన్యాలు, మిల్లెట్లు ఆక్రమించాలి. దాని తర్వాత పప్పులు, మాంసపు ఆహారాలు, గుడ్లు, పల్లీలు, నువ్వులు పాలు లేదా పెరుగు ఉండాలి. సురక్షితమైన, శుభ్రమైన ఆహారాన్ని తినడం, తగినంత నీరు తాగడం వంటి ఎనిమిది ఆహార సమూమాల నుంచి ‘మై ప్లేట్‌ ఆఫ్‌ ది డే’ కోసం కనీసం ఎనిమిది ఆహార సమూహాల నుంచి మాక్రోన్యూట్రియెంట్‌లు మార్గదర్శకాలు సిఫారసు చేశాయి, తృణధాన్యాలు తీసుకోవడం 45శాతానికి పరిమితం చేయాలి. పప్పులు, గుడ్లు, మాంసపు ఆహారం 14 నుంచి 15 శాతం వరకు ఉండాలి. కొవ్వు పదార్థాలు 30 శాతానికి పరిమితం చేయాలి.
నూనె గింజలు, పల్లీలు, నువ్వులు, పాలు, పాల ఉత్పత్తులు వరుసగా రోజుకు మొత్తం శక్తిలో 8-10 శాతానికి ఉండాలి. శరీరంలో కొవ్వు పెరగకుండా ఉప్పు తక్కువ మోతాదులో తీసుకోవాలి. నూనె, కొవ్వు పదార్థాలు తీసుకోవడం పరిమితం చేయాలి. స్థూలకాయాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, సరైన వ్యాయామం చేయడం, అల్ట్రా-ప్రాసెస్డ్‌ ఫుడ్‌లను కనిష్టంగా తగ్గించాలి. ఫుడ్‌ లేబుల్స్‌పై ఉండే సమాచారాన్ని చదివి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. రోజు తినే ఆహారంలో 50 నుంచి 70 శాతం తృణధాన్యాలు, 6 నుంచి 9 శాతం పప్పుదినుసులు, మాంసం, చికెన్‌, గుడ్లు, చేపలు ఉండాలి. ”గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆహారపు అలవాట్లు చాలా మార్పులకు లోనయ్యాయి, ఇది నాన్‌-కమ్యూనికేబుల్‌ వ్యాధుల వ్యాప్తికి దారితీసింది, అయితే పోషకాహార లోపం యొక్క కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి” అని ఆరోగ్య శాఖ కార్యదర్శి, రీసెర్చ్‌, డైరెక్టర్‌ జనరల్‌, రాజీవ్‌ బహ్ల్‌ అన్నారు.

ఎలా నివారించవచ్చు..చిన్న చిన్న జాగ్రత్తలతోనే
అనారోగ్యాన్ని చాలావరకు నియంత్రించవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం ఉంటే తగ్గించుకోవడం, పొగతాగే అలవాటు, మద్యం మానేయడం వంటివి చేస్తే చాలు రక్తపోటుతో వచ్చే అనర్థాలను చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యంగా జీవించొచ్చు. కానీ అనివార్యంగా పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాధుల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

Spread the love