‘జమిలి’ పేరుతో ప్రజల్లో గందరగోళానికి యత్నం

– మతిస్థిమితం లేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి : శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్‌
‘కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది.. షెడ్యూల్‌ ప్రకారం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి కానీ జమిలి ఎన్నికలు, మినీ జమిలి ఎన్నికలంటూ.. అన్ని రాజకీయ పార్టీలను.. ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు యత్నిస్తోంది’ అని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రయారిటీ లేదని పరేషాన్‌లో ఉన్న నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మతిస్థిమితం, స్థిరత్వం లేని వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విమర్శించారు. కేటీఆర్‌ కృషి వల్ల అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీనే గెలవబోతుందని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌లో తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారంటున్న కోమటిరెడ్డి.. తెలంగాణ ఏర్పా టును వ్యతిరేకించిన వైఎస్‌ షర్మిలను ఎందుకు కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమానికి బద్ధ వ్యతి రేకులు, రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వారు, ఎందరో ఆత్మబలిదానాలకు కారకులైన వారు నేటికీ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగు తున్నా రని చెప్పారు. ఈనెల 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహి స్తామన్నారు.

Spread the love