– మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీకి సరిపోను ఇంకా కావల్సినంత స్థలం ఉందని, అందులో నుండి 50 లేదా 100 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటూ ప్రభుత్వ పక్షాన అన్ని కోర్సులతో కూడిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజిని నెలకొల్పి మంజూరు చేయాలని డిచ్ పల్లి మాజీ ఎంపీపీ, టిఆర్ఎస్ సినియర్ నాయకులు, ఉద్యమకారుడు కంచెట్టి గంగాధర్ పేర్కొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీ ప్రజా ప్రతినిధులందరికి, ఓక లేఖను శుక్రవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా విద్యార్థుల అభివృద్ధి కోరుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ లో నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లో అన్ని కోర్సులతో కూడిన నిధులు నియామకాలతో కూడిన ఇంజనీరింంగ్ కాలేజిని మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసి, కోరి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజిని మంజూరు చేయించే విధంగా చూడాలని, జిల్లా విద్యార్థుల భవిష్యత్తులో వెలుగులు నింపాలని ప్రార్ధించారు. రానున్న శాసన సభ ఎన్నికలలో బిఅర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి జిల్లా ప్రజలు, విద్యార్థి లోకంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని,పేద, నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లలు దీవిస్తారని ఈ లేఖతో మిమ్మల్ని కోరుతున్నానని వివరించారు.