నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26,000 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని 20వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుటి , రిటైర్మెంట్ బెనిఫిట్ , పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం భయపడిందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, నల్లగొండ ప్రాజెక్టు నాయకురాలు సిహెచ్. నాగమణి, పద్మశ్రీ ,పి. ప్రమీల, పార్వతి, జ్యోతి, సముద్రమ్మ ,మణిరూప, రత్నమాల, ప్రకతాంబ, సునంద లక్ష్మమ్మ, భారతి,యాదమ్మ, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మద్దతు
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మండల జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకూరి రమేష్, బిఎస్పి జిల్లా నాయకులు కొల్లోజు వినోద్ చారి నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అన్నారు. శనివారం ఐసిడిఎస్ ఆఫీసు ఎదుట జరుగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె శిబిరానికి హాజరై వారు సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు యువజన కాంగ్రెస్ నాయకులు జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, గోగుల రాములమ్మ, గడిగా హిమబిందు, చిన్నాల అలివేలు జానయ్య, బోగరి ఆనంద్, బొజ్జ శంకర్, అమీనా సమ్మద్, అమీషా, పరిహాన్, కలిల్,కర్నాటి కరుణాకర్ రెడ్డి,ఏర్పుల తర్శిని, వేణుగోపాలరెడ్డి,గాలి నాగరాజు, అంబర్ల శ్రీనివాస్,మామిడి కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.