
– తల్లిదండ్రులకు ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత
నవతెలంగాణ – మద్నూర్
ప్రైవేటు చదువులు వద్దు అంగన్వాడి చదువులే ముద్దు చిన్నారి పిల్లలకు ప్రైవేటు చదువులకు పంపకుండా ప్రభుత్వ చదువులు అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ కవిత తల్లిదండ్రులకు సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలంలోని కొడిచర అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ చిన్నారి తల్లిదండ్రులకు అంగన్వాడి కేంద్రాల చదువుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి నరసవ్వ అంజని బాయి కొడిచర పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి ఆశా వర్కర్ రుక్మిణి బాయి చిన్నారులు చిన్నారుల తల్లిదండ్రులు ఆయాలు పాల్గొన్నారు.