నియోజకవర్గ అభివృద్దే అంతిమ లక్ష్యంగా.. ప్రజల కష్టాలను తీర్చడమే పరమావధిగా… భవిష్యత్ తరాలకు సన్మార్గం చూపే దర్శనికుడిగా.. అనునిత్యం ప్రజాసేవలోనే ఉంటూ అందరికీ అండగా నిలుస్తూ ప్రజా పాలన సాగిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సేవలు మరువలేనివి అని మండల ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్విరామంగా నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మండలంలోని కొండాపురం, కొండూరు, గణేష్ కుంట గ్రామాల నుండి విచ్చేసిన సుమారు 200 మంది లబ్ధిదారులతో మాట్లాడి వారికి డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ పత్రాలను పంపిణీ చేశారు. మేళకు వచ్చిన యువతతో ఆప్యాయంగా మాట్లాడి వారి పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రోగ్రామ్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.