నేడు ఏపీ క్యాబినెట్‌

నవతెలంగాణ- అమరావతి: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం శుక్రవారం జరగనుంది. ఎన్నికలు సమీపిస్తుండ టంతో ముఖ్యమైన నిర్ణయాలను సాధ్యమైనం త త్వరగా తీసుకోవాలని ప్రభుత్వం భావి స్తోంది. దీంతో తాజా సమావేశంలోనూ పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెట్టుబడుల అంశంతో పాటు విశాఖకు తరలివెళ్లడం, జిల్లాల పునర్విభజన తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. విశాఖలో ట్రాన్సిట్‌ వసతి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో పాలనాపరంగా ఎదురవుతున్న మిగతా 2లో సమస్యలను చర్చించనున్నారని తెలిసింది. కొన్ని జిల్లాలను రద్దు చేయడంతో పాటు పోలవరం జిల్లాను నూతనంగా ప్రతిపాదించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మంత్రివర్గంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఒకటి, రెండు ప్రభుత్వ శాఖలకు మంత్రిమండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Spread the love