గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: జాతీయ జెండా ఎగురవేసే క్రమంలో ఇద్దరుకి  కరెంటు షాక్ తగిలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా కేంద్రంలో బోడ అంజిత్, లాడ విజయ్, బోడ చక్రి అనే ముగ్గురు వ్యక్తులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ క్రమంలోనే ముగ్గురికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు.  స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు… డాక్టర్లు  బోడ అంజిత్, లాడ విజయ్ లు మృతి చెందినట్టు నిర్ధారించారు. బోడ చక్రి తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలను  మంత్రి సీతక్క పరామర్శించారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని సీతక్క హామీ ఇచ్చారు.

Spread the love