Friday, June 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఐటిఐలో దరఖాస్తులకు ఆహ్వానం..

ఐటిఐలో దరఖాస్తులకు ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : ఐటీఐ, ఏటీసీ, తదితర శిక్షణ కేంద్రాల్లో ఉన్న కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జన్నారం ఐటిఐ  కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఆయా కేంద్రాల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయిందన్నారు. 14 సంవత్సరాలు నిండిన పదవ తరగతి చదివి అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో ధ్రువీకరణపత్రాల కాపీలను వెబ్సైట్లో అప్లె చేయాలన్నారు. జూన్ 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్  లలో శిక్షణ పొందుటకు అవకాశం ఉంటుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -