– జిల్లా చేనేత జవలీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎండి కామిల్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నేతన్న బీమా పధకానికి ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యం.డి.కామిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేతన్న బీమా పధకానికి అర్హులైన జిల్లా లోని చేనేత కార్మికులు, మరమగ్గాల కార్మికులు, ఇతర అనుబంధ కార్మికులు ఈ నెల 9 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పధకములో నమోదైన కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా సహాయం అందుతుందన్నారు. 18 నుండి 59 సంవత్సరాల లోపు చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు జౌళిశాఖ కార్యాలయములో దారఖాస్తు చేసుకోవాలని సూచించారు.