నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ ను సోషల్ సైన్సెస్ కు డీన్ గా రెండేళ్ల పాటు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, పని చేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ అకాడమీ ఆడిట్ సెల్ డైరెక్టర్గా గావిధులు నిర్వహిస్తున్నారు. ఈ నియామకపు ఉత్తర్వులు అందుకున్న ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగం పంచుకుంటామని సామాజిక శాస్త్రంలో జరిగే మార్పులకు అనుగుణంగా పరిశోధనలు కొనసాగించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ సోషల్ సైన్సెస్ డీన్ గా నియామకపు ఉత్తర్వులు అందించినందుకు వైస్ ఛాన్సలర్, రిజిస్టార్లకు కృతజ్ఞతలు తెలిపారు.