
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల కురిసిన వర్షాలతో వచ్చిన వరదలకు ఉత్తమ సేవలందించిన మేడారం పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్ కు, సక్రమంగా విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించి ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించేల కృషిచేసిన కొడిశల బాలుర ఉన్నత ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుతారి రమేష్ కు, వర్షాలకు సైతం లెక్కచేయకుండా విద్యుత్ సేవలందిస్తూ ఉత్తమ సేవలందించిన మారుమూల ప్రాంతమైన రంగాపూర్ గ్రామానికి చెందిన బాడిశ దిలీప్ ఎన్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏటూర్ నాగారం ఐటిడిఏ పిఓ అంకిత్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రభుత్వం గుర్తించి పిఓ చేతుల మీదుగా అందించినందుకు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసి సంఘాలు, తుడుందెబ్బ సంఘాలు ప్రశంసించాయి.