కర్ణాటక హామీలపై చర్చకు సిద్ధమా

నవతెలంగాణ- మోర్తాడ్: అధికార పార్టీ మంత్రి బాల్కొండ అభ్యర్థి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్  చేపడుతున్న హామీలు అమలు కావడం లేదంటూ ప్రచారం చేస్తున్న వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి ప్రశ్నించారు. మోర్తాడ్ ప్రజా నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ప్రవేశపెట్టిన పథకాలు అమలు కావడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి బహిరంగ చర్చకు వేల్పూర్ చౌరస్తాకు రావాలని ప్రశ్నించారు. లేదా తాను స్వయంగా తన అనుచర బృందంతో కర్ణాటకకు తీసుకెళ్లడానికి తాము సిద్ధమని తమ భద్రత సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఏ గ్రామానికి అయినా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ హామీలను ప్రజలతో మాట్లాడి అమలు తీరు గురించి తెచ్చుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్న అధికార పార్టీకి గుణపాఠం చెప్పక తప్పదని, తప్పుడు మాటలతో అధికారం దక్కించేవాడు కావడానికి ప్రయత్నిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి అబద్ధ ప్రచారాలు ప్రశాంత్ రెడ్డి చేపడుతున్నారని అన్నారు.కర్ణాటక రాష్ట్రానికి రావడానికి కారులోనైనా లేక ప్రత్యేక విమానాలు అయినా ఏర్పాటు చేస్తామని తాను రావడానికి సిద్ధమ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్లు అయితే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షేమాపణ చెప్తారని అన్నారు. పత్రిక రాష్ట్రం అమలు సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి ఎమ్మెల్యే పదవులు ఇవ్వకుండా తమ కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే పదవులను ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా తెలంగాణ కోసం బలైన కుటుంబాలకు ఎన్ని సీట్లు ఇచ్చారో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.
Spread the love