హై బీపీతో బాధపడుతున్నారా?

హై బీపీతో బాధపడుతున్నారా?మారుతున్న కాలానుగుణంగా మనిషి జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. సరైన తిండి తినకపోవటం, సమయానికి నిద్ర లేకపోవటంతోపాటు పని ఒత్తిడి తోడవుతున్నది. ఫలితంగా మనిషి శరీరంలో హై బ్లడ్‌ ప్రెజర్‌ ఇబ్బందిపెడుతుంది. అలా జరిగినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దీంతో పక్షవాతం, హార్ట్‌ ఎటాక్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వర్క్‌ ప్రెజర్‌ని కంట్రోల్‌ చేసుకుంటే దీని ప్రమాదం నుండి తప్పించుకోవచ్చునని అంటున్నారు. సాధ్యమైనంత వరకు అధిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమయానికి నిద్ర, వ్యాయామం, సరైన ఆహారం ఉండాలంటున్నారు.
ఒకప్పుడు యువత ఆటలు ఆడేందుకు ఎక్కువ సమయం కేటాయించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో కూర్చున్న చోట నుంచి కదలకుండా ఫోన్‌ లోనే ఆటలు ఆడుతున్నారు. దీంతో శరీరానికి కావాల్సిన వ్యాయామం అందటం లేదు. పైగా ఫాస్ట్‌ ఫుడ్‌ ఎక్కువగా తినటంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో ఆయిల్‌ క్వాలిటీ గా లేకపోవడం, స్వీట్‌ షుగర్‌ను ఎక్కువగా వాడటంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని ఇవన్నీ బ్లడ్‌ ప్రెజర్‌ పెరిగేందుకు ఓ కారణమని కూడా అధ్యయనాలు చెబుతున్నాయన్నాయి. హై బ్లడ్‌ ప్రెజర్‌కి కారణానికి దారితీస్తున్న వాటికి దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. హై బ్లడ్‌ ప్రెజర్‌ కు సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపించినట్లే వెంటేనే సమీపంలోని వైద్యులని కలిసి తగిన మందులు, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Spread the love