ఉగాది పురస్కారం అందుకున్న కళాకారుడు కమ్ముల ప్రవీణ్

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పాత రుద్రారం గ్రామానికి చెందిన డప్పు వాయిద్య కళాకారుడు, గాయకుడు కమ్ముల ప్రవీణ్ కుమార్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురస్కాల్లో ప్రవీణ్ తన ప్రతిభను ప్రదర్షించిన నేపథ్యంలో మంగళవారం సేవా సమితి కార్యనిర్వహకులు కొలుగురి సంజీవ్ రావు చేతులమీదుగా మెమోంటో, ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు  ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన కవులు, కళాకారులు, ఆర్టిస్టులు,రచయితలతోపాటు వివిధ రంగాల్లో నైపుణ్యత కలిగిన వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నట్టుగా తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీక్రోదినామ సంవత్సర ఉగాది ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన వారికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలని వేంకటేశ్వర పంక్షన్ హాల్లో ప్రశంస పత్రాలు, మెమోంటోలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు. ప్రవీణ్ పురస్కారం అందుకోవడంపై గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.
Spread the love