పోరాటాల ఫలితంగా జీవో 33 విడుదల

– గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్‌ అమలు పట్ల హర్షం : ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోరాటాల ఫలితంగానే జీవో నెంబర్‌ 33ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పలు సార్లు మంత్రిని, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించామని గుర్తు చేశారు. ఫలితంగానే జీవో నెంబర్‌25కు సవరణచేసి జీవో 33ను జారీ వల్ల వికలాంగుల ప్రయోజనాలు కొంత మేరకు నెరవేరుతాయని తెలిపారు. ఈ జీవో ప్రకారమే లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5శాతం కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొనడం హర్షించదగిందని పేర్కొన్నారు. జీవో ప్రకారం జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love