హెల్త్ కేర్ లో కనీసం టాబ్లెట్ లేని దుస్థితి..

– అధికారులు చోద్యం చూడడం దారుణం..
నవతెలంగాణ- డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో హెల్త్ కేర్ లో కనీసం టాబ్లెట్లు లేని దుస్థితి నెలకొని ఉన్న అధికారులు చోద్యం చూడడం దారుణమని, అధికారులు హెల్త్ కేర్, హాస్టల్ లను సందర్శించడానికి సమయం లేదా? అని ఎన్ ఎస్ యు ఐ యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. బుదవారం యూనివర్సిటీ లోని హెల్త్ కేర్ ను సందర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు హాస్టలను సందర్శించడానికి సమయం లేదా? యూనివర్సిటీలో హెల్త్ కేర్ లో కనీసం టాబ్లెట్లు లేని దుస్థితి నెలకొని ఉన్న అధికారులు చోద్యం చూడడం దారుణ మన్నారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, అధికారులు హాస్టల్లను సందర్శించాలని అనేకసార్లు వినతి పత్రాలు అందించిన పాలన యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హాస్టల్లో నాణ్యత గల భోజనాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 24/7 గంటలు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్  ఉదయం సమయం కాకుండా కేవలం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉండడం విచిత్ర మన్నారు. తక్షణమే డాక్టర్ ను 24/7 ఉంచాలని యూనివర్సిటీ పేర్కొన్నారు. హెల్త్ కేర్ లో ఒక స్లీపర్ లేరని, నలుగురు సిస్టర్స్ ఉండాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారని, ఒక సెక్యూరిటీ లేరాని, ల్యాబ్ టెక్నీషియన్ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు . వర్షాకాలంలో  కనీసం పారసిటిమల్ టాబ్లెట్ కూడా లేకుండ చూస్తే ప్రభుత్వం తీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు.  ప్రతి యూనివర్సిటీలో స్పోర్ట్స్ బోర్డ్ కు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో ఏటా దాదాపు 1కోటి, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీకు 40 లక్షల వరకు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ నిధులతో క్రీడా మైదానం అభివృద్ధి పరికరాల కొనుగోలు అంతర్ యూనివర్సిటీ పోటీలకు వెళ్లే ప్రతి క్రీడాకారుడికి  కిట్లు,రవాణా ఖర్చులు చెల్లిస్తారని వివరించారు. ‌రాష్ట్రంలో మూడో పెద్ద యూనివర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీకి పేరు ఉందని, ఇక్కడ క్రీడలకు నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకర మన్నారు. యూనివర్సిటీ తోపాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించే టోర్నీలకు వెళ్లే వారికి బడ్జెట్ లేదని చేతులు దులుపుకుంటున్న దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ వస్తే ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని ఆశతో క్రీడాకారులు సొంతంగా ఖర్చులు భరిస్తూ టోర్నీలకు హాజరవుతున్నారని, యుజిసి నిబంధనల మేరకు యూనివర్సిటీలో 20 నుంచి 30 ఎకరాల్లో మేధానాలు ఉండాలే కానీ తెలంగాణ యూనివర్సిటీలో 577 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ స్టేడియం లేకపోవడం దురదృష్టకర మన్నారు. కేవలం సాధారణ మైదానంతో సరిపెడుతున్నారు.  యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ , రిజిస్త్రార్, ఎమ్మెల్యే  ఎమ్మెల్యే , మంత్రి స్పందించి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని డిమాండ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ వైస్ ప్రెసిడెంట్ మహేష్, అభినయ్, కార్యదర్శి రాజేందర్, సాగర్ నాయక్, రాము, విజయ్, మహేష్, రాజ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love