దారుణం.. పాకిస్తాన్‌లో చైనీయులపై కాల్పులు

నవతెలంగాణ- ఇస్లామాబాద్‌:బలూచిస్తాన్‌లోని గ్వాదర్‌ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్‌ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్‌ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు చైనా భద్రతా సిబ్బంది ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు(ఆగస్టు 14)న ఉగ్రవాదుల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో పాక్‌లో ఉ‍న్న చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్తాన్‌, సింధ్‌ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనీయులపై దాడులు ఎక్కువయ్యాయి.

Spread the love