బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలి

బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలి– 5న కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు : వామపక్ష పార్టీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. బొగ్గు బ్లాకులను నేరుగా సింగరేణికి అప్పగించాలని కోరాయి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల ఐదో తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించాయి. సోమవా రం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు రమ అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించా రు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహా, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు రామచందర్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్దన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎం శ్రీనివాస్‌, ఆకుల పాపయ్య, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, ఎస్‌యూసీఐ(సీ) నాయకులు ధర్మతేజ, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల ఐదో తేదీన అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Spread the love