Friday, May 8, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్‌‌కే ఆసీస్‌ ఓటు

ఐపీఎల్‌‌కే ఆసీస్‌ ఓటు

- Advertisement -

పాక్‌‌తో వన్డేలకు కమిన్స్,
హాజిల్‌‌వుడ్‌, స్టార్క్‌ దూర

మెల్‌‌బోర్న్‌: ఐపీఎల్‌19 లీగ్‌ ‌దశ ఆఖరు ఘట్టానికి చేరుకుంటుంది. లీగ్‌ ‌దశ 70 మ్యాచ్‌‌ల్లో గురువారం నాటికి 50 మ్యాచ్‌‌లు ముగిశాయి. మరో 20 మ్యాచ్‌‌లతో టాప్‌-4 రేసుకు తెరపడనుంది. ఈ నెల 24తో లీగ్‌ ‌దశ మ్యాచ్‌‌లు ముగియనుండగా.. 26న నుంచి ప్లే ఆఫ్స్‌ ఆరంభం అవుతాయి. 31న టైటిల్‌ ‌పోరు జరుగనుంది. ఆస్ర్టేలియా మూడు వన్డేల సిరీస్‌ ‌కోసం పాకిస్తాన్‌‌లో పర్యటించనుంది. ఈ నెల 30న రావల్పిండిలో తొలి వన్డే.. జూన్‌ 2, 4న లాహోర్‌‌లో చివరి రెండు వన్డేలు షెడ్యూల్‌ చేశారు. పాక్‌ ‌పర్యటనకు ఆసీస్‌ ‌బృందం 23న బయల్దేరనుంది. అయితే, ఐపీఎల్‌‌లో ఆడుతున్న ఆస్ర్టేలియా కీలక క్రికెటర్లు పాకిస్తాన్‌ ‌పర్యటనకు దూరంగా ఉంటున్నారు. పాట్‌ ‌కమిన్స్‌, జోశ్‌ ‌హాజిల్‌‌వుడ్‌, మిచెల్‌ ‌స్టార్క్‌, కూపర్‌ ‌కానొలి, ట్రావిశ్‌ ‌హెడ్‌‌లు ఐపీఎల్‌ ‌ప్లే ఆఫ్స్‌ ‌కోసం భారత్‌‌లోనే ఉండనున్నారు. సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌, పంజాబ్‌ ‌కింగ్స్‌, రాయల్‌ ‌చాలెంజర్స్‌ ‌బెంగళూరు దాదాపు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్లే ఆఫ్స్‌ ‌కోసం ఆసీస్‌ ‌క్రికెటర్లు ఐపీఎల్‌‌లో కొనసాగనున్నారు. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టు పాకిస్తాన్‌‌లో పర్యటించనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌ ‌కోసం బంగ్లాదేశ్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ ఏడాది టెస్టు సీజన్‌‌లో ఆస్ర్టేలియా సుమారు 20 టెస్టులు ఆడనుంది. దీంతో మ్యాచ్‌ ‌ఫిట్‌‌నెస్‌, పని ఒత్తిడిలో భాగంగా కమిన్స్‌, హాజిల్‌‌వుడ్‌, స్టార్క్‌‌ త్రయం బంగ్లాదేశ్‌ ‌పర్యటనకు సైతం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -